1999వ సంవత్సరంలో ఇదే రోజున (మే 26)న భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్ సమయంలో సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ అద్భుమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. టౌంటన్ మ్యాచ్‌లో ఇరువురు రెండో వికెట్‌కు 318 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వన్డేల్లో వీరిద్దరి భాగస్వామ్యంతో ఈ అరుదైన రికార్డును నెలకొల్పారు. అప్పటినుంచి క్రిస్ గేల్, మార్లన్ శామ్యూల్స్ భాగస్వామ్యంతో 372 పరుగులు చేసి వీరి భాగస్వామ్యాన్ని అధిగమించారు. అదే ఏడాది 1999లో లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్, ద్రావిడ్ 331 పరుగులు సాధించారు. అప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంకతో మ్యాచ్‌లో ఎస్ రమేశ్, సౌరవ్ గంగూలీ ముందుగా భారత తరపున బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఆదిలోనే భారత్ తొలి వికెట్ కోల్పోయింది.
చామిందా వాస్ తన బౌలింగ్‌లో రమేశ్ (5)లకే పెవిలియన్ పంపాడు. కానీ, తొలి వికెట్ కోల్పోయినప్పటికీ భారత్‌కు కలిసొచ్చింది. రమేశ్ స్థానంలో మూడో ఆటగాడిగా ద్రావిడ్ క్రీజులోకి వచ్చాడు. గంగూలీ, ద్రవిడ్ ఇద్దరూ కలిసి లంక బౌలర్లపై చెలరేగిపోయారు. బంతులను బౌండరీలు దాటిస్తూ తమ కెరీర్‌లోనే అత్యంత మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. గంగూలీ తన కెరీర్‌లోనే అత్యుత్తమంగా 183 పరుగులు సాధించగా, ద్రావిడ్ 145 పరుగులు సాధించాడు. భారత్ 324 పరుగుల వద్ద ఉండగా 46వ ఓవర్ లో రెండో వికెట్ కోల్పోయింది. ఇతర ఆటగాళ్లలో ఎవరూ కూడా రాణించలేకపోయారు. కానీ, గంగూలీ, ద్రావిడ్ ఇద్దరూ సూచనలతో భారత జట్టు 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 373 పరుగులు చేసింది. లంక ఛేజింగ్‌లో భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది.
ఆదిలోనే కీలకమైన రెండు వికెట్లను కోల్పోయింది. సనత్ జయసూర్య (3), రోమేశ్ కలువితరానా (7) పరుగులకే భారత బౌలర్ జవగల్ శ్రీనాథ్ చేతిలో చిక్కారు. దాంతో 23 పరుగులకే లంక రెండు వికెట్లను కోల్పోయింది. ఒక్కో వికెట్ కోల్పోతూ శ్రీలంక 42.3 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌట్ అయింది. లంక ఆటగాడు అరవింద డిసిల్వా 56 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. లంక కెప్టెన్ అర్జున రణతుంగ 42 పరుగులు చేశాడు. భారత తరపున ఆడిన రాబిన్ సింగ్ 9.3 ఓవర్లలో (5/31) వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
Read: మాజీ క్రికెటర్ కు కరోనా, తన కోసం ప్రార్థించాలని రిక్వెస్ట్