కొడుకు కోసం Barberలా మారిన సచిన్

  • Publish Date - May 20, 2020 / 03:34 AM IST

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొత్త అవతారమెత్తాడు. కొడుకు అర్జున్ టెండూల్కర్ కు హెయిర్ కట్ చేస్తూ బార్బర్ లా మారిపోయాడు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేయడంతో ఫుల్ ఫ్యామస్ అయిపోయింది. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో క్రికెట్ ఆడటం లేక మైదానాలు బోసిపోయాడు. క్రికెటర్లు సోషల్ మీడియాలో కొత్త స్టంట్లతో అభిమానులు ఇలా అలరిస్తున్నారు. 

అయితే ఈ వీడియోలో సచిన్ టెండూల్కర్ హెయిర్ కట్ చేస్తుండగా కూతురు సారా తండ్రికి సాయం చేస్తూ ఉంది. ఆ పోస్టు పెట్టిన తర్వాత టెండూల్కర్ ఇలా కామెంట్ చేశాడు. ఓ తండ్రిగా నువ్వు ఏదైనా చేయాల్సి ఉంటుంది. పిల్లలతో కలిసి ఆడాల్సి ఉంటుంది. వారితో కలిసి జిమ్ చేయాలి. అవసరమైతే హెయిర్ కట్ కూడా చేయాలి. ఏదేమైనా హెయిర్ కట్ చేసుకున్న ప్రతీసారి అర్జున్ చాలా అందంగా కనిపిస్తాడు. నా అసిస్టెంట్ సారా టెండూల్కర్ కు ప్రత్యేక థ్యాంక్స్. 

లాక్ డౌన్ సమయంలో టెండూల్కర్ కుటుంబంతో కలిసి క్వాలిటీ టైం గడుపుతున్నాడు. అంతకంటే ముందు సారా చేసిన వంట ఫొటోలను సోషల్ మీడియోలో షేర్ చేశాడు సచిన్. ‘బీట్ రూట్ కబాబ్స్ చేసినందుకు థ్యాంక్స్. 60సెకన్లలో పూర్తయిపోయాయి’ అంటూ వాటికి కామెంట్ కూడా పెట్టాడు. 

అర్జున్ టెండూల్కర్ క్రికెట్ లో బ్యాట్స్ మన్ గా అడుగుపెట్టి అంతగా సక్సెస్ కాలేకపోవడంతో బౌలర్ గా మారాడు. కొన్ని సార్లు మైదానంలో డ్రింక్స్ అందిస్తూ.. ఖాళీ దొరికితే స్టేడియంలోని స్టాండ్లలో నిద్రపోతూ ఉన్న ఫొటోలు వైరల్ అయ్యాయి. (తండ్రైన ఉసేన్ బోల్ట్)