Akshaya Tritiya 2026 : అక్షయ తృతియ వేళ అమ్మవారికి నైవేద్యంగా ఇవి సమర్పించండి.. మీ అప్పులు, ఆర్థిక సమస్యలన్నీ పరార్..!

Akshaya Tritiya 2026 : అక్షయ తృతియ నాడు లక్ష్మీ దేవిని పూజించి.. ఈ నైవేద్యాలు సమర్పిస్తే.. ఆర్థిక సమస్యలన్నీ తీరతాయంటున్నారు.

akshaya tritiya 2026 lakshmi puja rituals and prasad for wealth and prosperity in home

Akshaya Tritiya 2026 :వైశాఖ శుద్ధ తదియ అదే అక్షయ తృతీయ హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజు. ఇది వైశాఖ మాసంలో శుక్ల పక్షం మూడో రోజున వస్తుంది. ఈ రోజును కృతయుగ ఆరంభంగా, పరశురామ జయంతిగా కూడా జరుపుకుంటారు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనడం, దానధర్మాలు, పూజలు చేయడం వల్ల అక్షయమైన (తరగని) పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతారు.

అక్షయ తృతీయ అంటే..

‘న క్షయః ఇతి అక్షయః’ – అంటే నశించనిది, తరగనిది అని అర్థం. ఈ రోజు ఏ మంచి పని ప్రారంభించినా, బంగారం కొన్నా అక్షయంగా అంటే నాశనం లేకుండా వృద్ధి చెందుతుందని నమ్మకం. అక్షయ తృతీయ నాడు ఇంటిలో ఇలా లక్ష్మీ పూజ చేస్తే కలిసి వస్తుందంటున్నారు పండితులు.

లక్ష్మీ పూజ చేయాలనుకునేవారు.. అక్షయ తృతీయ నాడు ఉదయాన్నే నిద్రలేచి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. మామిడాకులు, పువ్వులతో అందంగా అలంకరించి.. ఇంటి ముందు ముగ్గు వేయాలి. దీంతో పాటు పూజ గదిని కూడా శుభ్రం చేసి, అందంగా అలంకరించాలి.

పూజా సమయం

అక్షయ తృతీయ ఆదివారం నాడు ఉదయం 6-7 గంటల లోపు పూజ చేసి, కుటుంబ సభ్యులకు హారతిని ఇవ్వాలి. ఇక ఈ పూజ కోసం తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. ముఖ్యంగా లక్ష్మీదేవి పూజలో ఆవు నెయ్యి, అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు తప్పకుండా ఉండాలి.

పూజా విధానం

లక్ష్మీ పూజలో భాగంగా.. ముందుగా వెండి చెంబు తీసుకుని.. దాంట్లో నీరు పోసి.. కొబ్బరి కాయ పెట్టి కలశాన్ని ఏర్పాటు చేయాలి. ఆపై దానికి పూజ చేయాలి. అనంతరం అమ్మవారిని స్మరిస్తూ, ఆవు నెయ్యితో దీపం వెలిగించి, హారతి ఇవ్వాలి. ఈరోజు తప్పకుండా లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని చదవాలి.

ప్రసాదం..

అలాగే అక్షయ తృతీయ నాడు అమ్మవారికి పాయసం నైవేద్యం పెట్టాలి. దీంతో పాటు పూలు, గాజులు, చీర, పండ్లు కూడా పెట్టొచ్చు. ఇలా నిష్టగా, భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజ చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇంటిలో ఆర్థిక సమస్యలు తొలగి.. అప్పులు తీరతాయి. ధన ప్రాప్తి కలుగుతుంది.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం పాఠకుల ఆసక్తిమేరకు ఇవ్వడం జరిగింది. దీన్ని 10tv నిర్ధారించడంలేదు.