Ashtami: ఏప్రిల్ 10.. అష్టమి+పూర్వాషాఢ నక్షత్రం.. ఇలా చేస్తే అకాల మరణ భయం తొలగిపోతుంది..!

తెల్లవారుజామునే స్నానం చేయాలి. కాలబైరవుడికి అభిషేకం, పూజ చేయాలి. నల్ల కుక్కలకు ఆహారం పెట్టాలి.

  • Published On : April 10, 2026 / 06:00 AM IST

 

Ashtami: ఏప్రిల్ 10వ తేదీ.. శుక్రవారం.. చాలా విశేషమైన రోజు. ఎందుకంటే అష్టమి+పూర్వాషాఢ నక్షత్రం వచ్చింది. అష్టమి, పూర్వాషాఢ నక్షత్రం చాలా విశేషమైన కలయిక అని పండితులు చెబుతున్నారు. ఈ రోజున కాలబైరవుడిని పూజించడం, కాలబైరవ అష్టకం పఠించడం వల్ల అకాల మరణ భయం తొలగిపోతుందని పండితులు తెలిపారు. అలాగే దుష్ట శక్తుల నుంచి రక్షణ లభిస్తుందని నమ్ముతారు. ఈ రోజు కాలభైరవుడిని పూజిస్తే పాపాలు నశిస్తాయని, కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. తెల్లవారుజామునే స్నానం చేయాలి. కాలబైరవుడికి అభిషేకం, పూజ చేయాలి. నల్ల కుక్కలకు ఆహారం పెట్టాలి. కాలబైరవాష్టకం చదవడం చాలా మంచిది. శత్రు బాధలు, భయం, కష్టాలు తొలగిపోయి.. ఆయురారోగ్యాలు సిద్దిస్తాయని పండితులు చెబుతున్నారు.