Hanuman Jayanti 2026 : మే 12 హనుమాన్ జయంతి+మంగళవారం.. తమలపాకుపై ఇలా దీపం వెలిగిస్తే శని బాధలు, అప్పుల కష్టాలు పరార్..!
Hanuman Jayanti 2026 : మే 12, మంగళవారం నాడు హనుమాన్ జయంతి. ఈ సందర్భంగా అప్పుల భారం, శని బాధల నుంచి దూరం అవ్వాలంటే ఈ పరిహారం పాటించమంటున్నారు పండితులు.
- Dharani Pilli
- Updated on- May 10, 2026 / 06:03 PM IST
Hanuman Jayanti 2026 Light navadhanya deepam on a Betel Leaf to Vanish Shani Troubles and Debt Burdens
Hanuman Jayanti 2026 : చిన్నలు, పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో ఆరాధించే దైవం.. పిల్లలకు ఆప్తమిత్రుడు ఎవరంటే హనుమంతుడు. భక్తుల హృదయాల్లో ఇలాంటి స్థానాన్ని సంపాదించుకున్న హనుమంతుడిని ప్రత్యేకంగా పూజించుకోవడానికి రెండు ప్రత్యేక దినాలు ఉన్నాయి. అవే హనుమాన్ జయంతి. ప్రతి ఏటా రెండు హనుమాన్ జయంతులు జరుపుకుంటాము. ఒకటి శ్రీరామనవమి తర్వాత వచ్చేది కాగా.. మరోటి వైశాఖ మాసంలో వచ్చే హనుమాన్ జయంతి.
ఈ సంవత్సరం కూడా వైశాఖ మాసం బహుళ పక్షం దశమి అంటే మే 12 నాడు హనుమాన్ జయంతి జరుపుకోబోతున్నాం. అయితే ఈ సారి హనుమాన్ జయంతికి చాలా ప్రత్యేకత ఉంది. ఆంజనేయుడికి ఎంతో ప్రీతిపాత్రమైన మంగళవారం నాడే హనుమాన్ జయంతి వస్తుంది. ఇలాంటి పరమ పవిత్రమైన రోజున తమలపాకు మీద నవధాన్యాలు పోసి దీపం వెలిగిస్తే.. జాతకంలో శని బాధలు తొలగుతాయని.. అప్పుల భారం నుంచి బయటపడతారని పండితులు చెబుతున్నారు.
నవధాన్య దీపం :
హనుమజ్జయంతి రోజున తమలపాకుపై నవధాన్యాలు పోసి, దానిపై దీపం వెలిగించడం వల్ల అనేక ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయి.
దీపం వెలిగించే విధానం:
ఒక తమలపాకుపై గుప్పెడు నవధాన్యాలు పోసి, దానిపై మట్టి ప్రమిద ఉంచాలి.
నవగ్రహ అనుగ్రహం:
తమలపాకు మీద నవధాన్యాలు పోసి దీపాన్ని వెలిగించడం వల్ల నవగ్రహాల అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
జాతక దోషాల నివారణ:
హనుమాన్ జయంతి నాడు నవధాన్య దీపం వెలిగించడం ద్వారా మన జాతకాల్లో తెలిసి తెలియక ఉండే వివిధ దోషాల ప్రభావం తగ్గుతుంది. మరీ ముఖ్యంగా రాహు-కేతు దోషాలు, కుజ దోషం నుండి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు.
శని దోషాల నుంచి విముక్తి:
హనుమాన్ జయంతి నాడు తమలపాకు మీద నవధాన్యాల దీపం వెలిగించడం వల్ల శని ప్రభావం వల్ల కలిగే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని వంటి దోషాల నుండి బయటపడవచ్చని పండితులు చెబుతున్నారు. ఒకవేళ ఇంట్లో పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటం లేకపోయినా.. ఈ నవధాన్యాల దీపాన్ని వెలిగించి, ఆ జ్యోతిని పంచముఖ ఆంజనేయ స్వామిగా భావించి పూజించవచ్చు.
ఇతర పరిహారాలు
సింధూర దీపం:
- సింధూరాన్ని ఆవునెయ్యి లేదా నువ్వుల నూనెలో కలిపి వత్తులకు రాసి, ఆ ఐదు వత్తులతో దీపారాధన చేయాలి.
- సింధూరం కలిపిన ఐదు వత్తులతో (పంచ వత్తులు) ఈ దీపాన్ని వెలిగించడం వల్ల స్వామి వారి అనుగ్రహం లభించి కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు.
