Shani Trayodashi: శని త్రయోదశి ప్రత్యేకం.. ఏలినాటి శని పోవాలంటే ఏం చేయాలి? ఈ పరిహారాలు తప్పకుండా చేయించుకోండి

ప్రతి నెలలో అమావాస్యకు ముందు వచ్చే త్రయోదశి(Shani Trayodashi) తిథిని శనివారం రోజు కలిసినప్పుడు దాన్ని శని త్రయోదశిగా పరిగణిస్తారు.

Here are the things to do and avoid on Shani Trayodashi.

  • శని త్రయోదశి పవిత్ర రోజు
  • శని పరిహారాలు తప్పనిసరి చేయాలి
  • కష్టాల నివారణకు ఆచారాలు ఉపయోగం

Shani Trayodashi: శని త్రయోదశి అనేది హిందూ జ్యోతిష్య, ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో ఎంతో ప్రత్యేకంగా భావించే రోజు. ప్రతి నెలలో అమావాస్యకు ముందు వచ్చే త్రయోదశి తిథిని శనివారం రోజు కలిసినప్పుడు దాన్ని శని త్రయోదశిగా పరిగణిస్తారు. 2026 జూన్ 13న శని త్రయోదశి (అధిక జ్యేష్ట మాసంలో) ఏర్పడుతుందని చెప్పబడుతోంది. ఈ రోజును శని దేవునికి అంకితం చేసిన పవిత్ర దినంగా భక్తులు భావిస్తారు. శని దేవుడు న్యాయం, కర్మఫలం, క్రమశిక్షణకు అధిపతిగా పరిగణించబడతాడు. అందుకే ఈ రోజున చేసే ఆరాధన, దానం, జపం వంటి కార్యాలు విశేష ఫలితాలను ఇస్తాయని విశ్వాసం ఉంది.

Anna Lezhneva: ఎన్నో అవమానాలు.. ఇంకెన్నో భావోద్వేగ క్షణాలు.. పవన్‌ పొలిటికల్ జర్నీపై భార్య ఎమోషనల్ పోస్ట్

శని దేవునికి చేయాల్సిన పరిహారాలు:

ఈరోజున శని దేవాలయంలో తైలాభిషేకం చేయడం అత్యంత శక్తివంతమైన పరిహారంగా భక్తులు భావిస్తారు. నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించడం శని (Shani Trayodashi)దోషాలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. “ఓం శం శనైశ్చరాయ నమః” మంత్రాన్ని 108 సార్లు జపించడం మానసిక స్థిరత్వం, ధైర్యం కలిగిస్తుంది. నల్ల నువ్వులు, నల్ల వస్త్రాలు, ఇనుము వస్తువులు దానం చేయడం ద్వారా పాపఫలాలు తగ్గుతాయని నమ్మకం ఉంది.

సేవా, భక్తి చర్యలు:

కాకులకు ఆహారం పెట్టడం, వృద్ధులు, దివ్యాంగులకు సహాయం చేయడం శని దేవుని అనుగ్రహాన్ని పొందేందుకు ముఖ్యమైన మార్గాలు. హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పారాయణం చేయడం ద్వారా భయాలు తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ సేవా చర్యలు కేవలం ఆధ్యాత్మిక ఫలితాలకే కాకుండా మనసుకు శాంతిని కూడా ఇస్తాయి.

ఎవరు ఈ పరిహారాలు చేయాలి?

మేష, కటక, సింహ, వృశ్చిక, ధనుస్సు, మీన లగ్నాల వారికి శని ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పబడుతుంది. అలాగే శని మహాదశ లేదా అంతర్దశ నడుస్తున్నవారు, ఏలినాటి శని (సాడే సాతి) అనుభవిస్తున్నవారు తప్పనిసరిగా ఈ పరిహారాలు చేయాలి. ఉద్యోగ, వ్యాపార, కోర్టు సమస్యలు లేదా అప్పుల బాధల్లో ఉన్నవారికి కూడా ఈ రోజు ప్రత్యేకంగా ఉపయోగకరంగా భావిస్తారు.