Tirumala
Tirumala : జూన్ నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగనున్న విశేష పర్వదినాలను టీటీడీ ప్రకటించింది.
జూన్ 1న మొదటి ఘాట్ రోడ్డులోని శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో అష్టోత్తర శతకలశాభిషేక తిరుమంజనం.
జూన్ 3న శ్రీ నమ్మాళ్వార్ల ఉత్సవారంభం.
జూన్ 10న వసంత మండపంలో విష్ణు అర్చనం పూజ.
జూన్ 12 నుండి 14వ తేదీ వరకు శ్రీవారి జ్యేష్టాభిషేకం.
జూన్ 29న శ్రీ పెరియాళ్వార్ ఉత్సవారంభం జరుగుతాయని టీటీడీ తెలిపింది.