Suryapet : అభివృద్ధిలో ఆధ్యాత్మికత ఒక భాగం – చినజీయర్ స్వామి
సూర్యాపేట జిల్లా కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ జీర్ణోద్ధరణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ శ్రీదండి చినజీయర్ స్వామి పాల్గొన్నారు
- kunduru Vinod
- Updated on- August 23, 2021 / 10:03 PM IST
Suryapet
Suryapet : సూర్యాపేట జిల్లా కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ జీర్ణోద్ధరణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ శ్రీదండి చినజీయర్ స్వామి, మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా చినజీయర్ స్వామి మాట్లాడుతూ.. అభివృద్ధిలో ఆత్యాత్మికత ఒక భాగమని తెలిపారు. సమాజాభివృద్ధిలో భగవత్ భక్తి అవసరమని అన్నారు.
కేసీఆర్ ఆధ్యాత్మిక ట్రెండ్ సృష్టికర్త అని అభివర్ణించారు. భక్తుడిని కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం చేసిన పాలకుడు కేసీఆర్ అని, దీనికి యాదాద్రి పునరుద్ధరణే నిదర్శనమని తెలిపారు. కేసీఆర్ స్ఫూర్తిని మంత్రి జగదీష్ రెడ్డి కొనసాగిస్తున్నారని తెలిపారు చినజీయర్ స్వామి.
యజ్ఞయాగాదులతో పర్యావరణ పరిరక్షణ జరుగుతుందని వివరించారు. శ్రీశ్రీశ్రీ రామనుజాచార్యుల కృషితో ఆధ్యాత్మికత విస్తరణ జరిగిందని అన్నారు.
