Vakula Matha : వకుళమాత ఆలయ మహాసంప్రోక్షణకు అంకురార్పణ
తిరుపతి సమీపంలోని పాత కాల్వ వద్ద పేరూరు బండపై నిర్మించిన శ్రీ వకుళమాత ఆలయ మహాసంప్రోక్షణకు శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జూన్ 23వ తేదీ వరకు జరుగనున్నాయి.
- chvmurthy
- Published On : June 18, 2022 / 09:48 PM IST
vakula matha
Vakula Matha : తిరుపతి సమీపంలోని పాత కాల్వ వద్ద పేరూరు బండపై నిర్మించిన శ్రీ వకుళమాత ఆలయ మహాసంప్రోక్షణకు శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జూన్ 23వ తేదీ వరకు జరుగనున్నాయి.
జూన్ 23వ తేదీన ఉదయం 7.30 నుండి 8.45 గంటల వరకు విగ్రహప్రతిష్ట, మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు. శనివారం సాయంత్రం 6.30 గంటలకు శోభాయాత్ర వేడుకగా జరిగింది. రాత్రి 7.30 గంటలకు పుణ్యాహవచనం, ఆచార్య ఋత్విక్ వరణం, మృత్సంగ్రహణం, అంకురార్పణ నిర్వహించారు.
టిటిడి వైఖానస ఆగమ సలహాదారు శ్రీ వేదాంతం విష్ణుభట్టాచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు, టీటీడీ కి చెందిన ఇతర అధికారులుపాల్గోన్నారు.
