Abhishek Sharma is yet to score a run at this T20 World Cup 2026
Abhishek Sharma : టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ అదరగొడుతోంది. వరుస విజయాలతో సూపర్-8కి అర్హత సాధించింది. ఆదివారం కొలంబో వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ భారత్ ఘన విజయం సాధించింది. వరుస విజయాలతో జోష్‌లో ఉన్న భారత్‌కు ప్రస్తుతం ఓ విషయం బాగా కలవరపెడుతోంది. అదే అభిషేక్ శర్మ ఫామ్.
నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా పొట్టి ప్రపంచకప్ 2026లో అడుగుపెట్టాడు అభిషేక్ శర్మ. ఇప్పటి వరకు అతడు రెండు మ్యాచ్‌లు ఆడాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ అతడు డకౌట్లు అయ్యాడు. విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో చెలరేగే అతడు కనీసం పరుగుల ఖాతా తెరవకపోవడంతో ఫ్యాన్స్‌తో పాటు జట్టు మేనేజ్‌మెంట్‌లోనూ ఆందోళన నెలకొంది.
యూఎస్ఏతో మ్యాచ్‌లో డకౌట్ అయిన తరువాత అభిషేక్ అనారోగ్యంతో నమీబియాతో జరిగిన మ్యాచ్‌కు దూరం అయ్యాడు. కోలుకుని పాక్‌తో మ్యాచ్‌లో జట్టులోకి వచ్చిన అతడు మరోసారి నిరాశ పరిచాడు. పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి షాహీన్ షా అఫ్రిది క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఇక పొట్టి ప్రపంచకప్ 2026 ముందు న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో.. అభిషేక్ రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ కావడం గమనార్హం.
ప్రస్తుతం అభిషేక్ విఫలమైనా కూడా భారత్ గెలుస్తుండడంతో ఏం కావడం లేదుగానీ.. కీలకమైన సూపర్-8 ముందు అతడు ఫామ్ అందుకోవడం ఎంతో ముఖ్యం. గ్రూప్ దశలో చివరి మ్యాచ్‌లో బుధవారం భారత జట్టు నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనైనా అభిషేక్ ఫామ్ అందుకోవాలని ఫ్యాన్స్‌తో పాటు టీమ్‌మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది.