Nz Vs Afg T20
NZ vs Afg T20 : యూఏఈ వేదికగా జరుగుతున్నటీ20 వరల్డ్ కప్‌లో విషాదం చోటుచేసుకుంది. అబుదాబిలోని షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియం చీఫ్ క్యురేటర్‌గా పనిచేస్తున్న ఇండియన్ మోహన్ సింగ్ సూసైడ్ చేసుకున్నారు. అఫ్ఘానిస్తాన్ – న్యూజిలాండ్ మ్యాచ్‌కి గంట ముందు పీచ్‌ను పరిశీలించిన సింగ్ అనంతరం తన గదిలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
చదవండి : NZ vs Afg T20: న్యూజిలాండ్ ముందు స్వల్ప లక్ష్యం.. భారత్ ఆశలు గల్లంతేనా?
మోహన్ మృతి పట్ల అబుదాబి క్రికెట్ ,ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సంతాపం వ్యక్తం చేశాయి. కానీ, తన మృతికి గల కారణాలను మాత్రం వెల్లడించడలేదు. కాగా మోహన్ కు భార్య ఓ కూతురు ఉన్నారు. 2000 సంవత్సరంలో యూఏఈ వెళ్లిన మోహన్ అప్పటి నుంచి షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియం పిచ్ క్యూరేటర్ గా పనిచేస్తున్నారు. గతకొంతకాలంగా మోహన్ డిప్రెషన్‌లో ఉన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.
చదవండి : ICC T20 : ప్రమాదం నుంచి తప్పించుకున్న అంపైర్..వీడియో వైరల్