Shubman Gill record : బాబర్ ఆజాం ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్.. ఐసీసీ చరిత్రలో ఒకే ఒక్కడు..
టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఓ అరుదైన (Shubman Gill record) ఘనతను సొంతం చేసుకున్నాడు. నాలుగో సారి ఐసీసీ

Shubman Gill becomes first player to receive ICC Player Of The Month Award 4times
Shubman Gill record : టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు చాలా మంచి కాలం నడుస్తోంది. అతడి నాయకత్వంలో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ను భారత్ 2-2తో సమం చేసింది. తాజాగా..జూలై 2025 నెలకు గానూ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గిల్ గెలుచుకున్నట్లు ఐసీసీ ప్రకటించింది. ఈ క్రమంలో గిల్ ఓ అరుదైన ఘనతను (Shubman Gill record) సొంతం చేసుకున్నాడు. అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో అతడు పాక్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజాం(Babar Azam) ను అధిగమించాడు.
ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును బాబర్ ఆజాం ఇప్పటి వరకు మూడు సార్లు అందుకోగా.. గిల్ తాజా అవార్డుతో కలిసి నాలుగు సార్లు తీసుకున్నాడు. వీరిద్దరి తరువాత శ్రేయస్ అయ్యర్, షకీబ్ అల్ హసన్, హ్యారీ బ్రూక్ తదితరులు తలా ఓ రెండు సార్లు సొంతం చేసుకున్నారు.
అత్యధిక సార్లు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అందుకున్న పురుష క్రికెటర్లు వీరే..
* శుబ్‌మన్ గిల్ (భారత్) – 4 సార్లు
* బాబర్ ఆజం (పాకిస్తాన్) – 3 సార్లు
* శ్రేయస్ అయ్యర్ (భారత్) – 2 సార్లు
* షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్) – 2 సార్లు
* హ్యారీ బ్రూక్ (ఇంగ్లాండ్) – 2 సార్లు
* కమిందు మెండిస్ (శ్రీలంక) – 2 సార్లు
* జస్‌ప్రీత్ బుమ్రా (భారత్) – 2 సార్లు
* మహమ్మద్ వసీం (యూఏఈ) -2 సార్లు
Fans troll Pakistan : ఇది కదా పాకిస్తాన్ అంటే.. విండీస్ కెప్టెన్ కొట్టిన స్కోరును కూడా.. 120కి 92..
754 పరుగులు..
ఇంగ్లాండ్ గడ్డ పై శుభ్‌మన్ గిల్ పరుగుల వరద పారించాడు. 5 టెస్టు మ్యాచ్‌ల్లో 75.9 సగటుతో 754 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. ఇక అవార్డుకు పరిగణలోకి తీసుకున్న జూలై నెలలో గిల్ మూడు టెస్టుల్లో 567 పరుగులు సాధించాడు. ఇందులో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో అతడు 269, 161 పరుగులతో రాణించాడు.
ఎంతో సంతోషంగా ఉంది..
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అందుకోవడం పై శుభ్‌మన్ గిల్ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో తాను ఆడిన 269 పరుగుల ఇన్నింగ్స్ తన కెరీర్‌లో ఎప్పటికీ తనకు మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుందన్నాడు. ఇక ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ద్వారా కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎంతో నేర్చుకునే అవకాశం వచ్చిందన్నాడు. రెండు జట్లు కూడా చాలా బాగా ఆడాయన్నాడు. ఆటగాళ్లు అందరూ చక్కని ప్రదర్శన చేశారని మెచ్చుకొచ్చాడు. ఇక పై కూడా తాను ఇలాంటి తరహా ప్రదర్శనను కొనసాగిస్తానని చెప్పుకొచ్చాడు.