ODI World Cup 2023: పాకిస్థాన్ జట్టుపై విజయం తరువాత బస్సులో డ్యాన్స్ వేసిన అఫ్గాన్ ప్లేయర్స్.. ఏ పాటకో తెలుసా? వీడియో వైరల్
పాక్ జట్టుపై విజయం తరువాత స్టేడియంలో అఫ్గాన్ ఫ్లేయర్స్ సంబురాలు చేసుకున్నారు. మైదానం మొత్తం కలియ తిరుగుతూ సందడి చేశారు.
- Harishth Thanniru
- Published On : October 24, 2023 / 09:39 AM IST
Afghanistan Team
ODI World Cup 2023 PAK vs AFG Match: భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023లో అఫ్గానిస్థాన్ జట్టు మరోసారి సంచలనం సృష్టించింది. ఇప్పటికే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ జట్టుపై సంచలన విజయాన్ని నమోదు చేసిన ఆ జట్టు.. సోమవారం చెన్నై స్టేడియంలో పాకిస్థాన్ వర్సెస్ అఫ్గానిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో ఆ జట్టు ఏడు వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన అఫ్గాన్ బ్యాటర్లు అద్బుత ప్రతిభ కనబర్చారు. ఫలితంగా కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 49 ఓవర్లలో 286 పరుగులు చేయడంతో అఫ్గాన్ జట్టు విజయం సాధించింది.
Afghanistan Win : వరల్డ్‌కప్‌లో మరో సంచలనం.. పాకిస్థాన్‌పై అఫ్ఘానిస్థాన్ ఘన విజయం
పాక్ జట్టుపై విజయం తరువాత స్టేడియంలో అఫ్గాన్ ఫ్లేయర్స్ సంబురాలు చేసుకున్నారు. మైదానం మొత్తం కలియ తిరుగుతూ సందడి చేశారు. మరోవైపు మైదానం నుంచి హోటల్ కు వెళ్తున్న క్రమంలో బస్సులో అఫ్గాన్ ప్లేయర్స్ డ్యాన్సులు చేస్తూ సందడి చేశారు. బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ హీరోగా నటించిన ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ సినిమాలోని ‘లుంగీ డ్యాన్స్’ పాటకు డ్యాన్స్ చేస్తూ అఫ్గాన్ ప్లేయర్స్ సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
https://twitter.com/hemrajdewasi29/status/1716640929531240708
