IND vs AFG : టీ20 సిరీస్ షెడ్యూల్ మార్చండి.. వినాయ‌క చ‌వితి రోజు మ్యాచ్ ఆడ‌దాం.. బీసీసీఐకి అఫ్గాన్ రిక్వెస్ట్

సెప్టెంబ‌ర్ 13 నుంచి భార‌త్, అఫ్గానిస్థాన్ జ‌ట్ల మ‌ధ్య (IND vs AFG) మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.

Afghanistan wants change of schedule for india t20 series

IND vs AFG : సెప్టెంబ‌ర్ 13 నుంచి భార‌త్, అఫ్గానిస్థాన్ జ‌ట్ల మ‌ధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. అయితే.. ఈ షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకునే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ సిరీస్ షెడ్యూల్‌లో మార్పు కోసం బీసీసీఐతో అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు చ‌ర్చ‌లు ప్రారంభించిన‌ట్లు తెలుస్తోంది.

స్వ‌దేశంలో అస్థిర ప‌రిస్థితుల కార‌ణంగా గ‌త కొంత‌కాలంగా హోమ్ సిరీస్‌ల‌ను భార‌త్ వేదిక‌గానే అఫ్గానిస్థాన్ నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా భార‌త్‌తో జ‌రగ‌బోయే సిరీస్‌కు అఫ్గాన్ ఆతిథ్య దేశంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఈ మ్యాచ్‌లు అన్ని ఢిల్లీ వేదిక‌గానే జ‌ర‌గ‌నున్నాయి. తాజాగా సిరీస్ షెడ్యూల్‌ను మార్చాల‌ని అఫ్గాన్ యోచిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

IND vs SL : శ‌నివారం నుంచి తొలి టెస్టు.. టీమ్ఇండియాకు శ్రీలంక కెప్టెన్ వార్నింగ్..

సిరీస్‌లో తొలి టీ20 మ్యాచ్ లేదా రెండో టీ20 మ్యాచ్‌ను సెప్టెంబ‌ర్ 14న నిర్వ‌హించాల‌ని అఫ్గానిస్థాన్ భావిస్తోంది. ఎందుకంటే ఆ రోజు వినాయ‌కచ‌వితి కావ‌డం. పండ‌గ రోజు సెల‌వు ఉండ‌డంతో మ్యాచ్‌ను వీక్షించేందుకు స్టేడియానికి ప్రేక్ష‌కులు పెద్ద సంఖ్య‌లో వ‌స్తార‌ని అఫ్గాన్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. అదే స‌మ‌యంలో టీవీ, డిజిట‌ల్ వీక్ష‌కులు భారీగా పెరిగే ఛాన్స్ ఉండ‌డంతో ఈ ఆలోచ‌న చేస్తున్న‌ట్లు స‌మాచారం.

ఇప్ప‌టికే ఈ విష‌యాన్ని బీసీసీఐ దృష్టికి తీసుకువెళ్లింది. ఈ ప్ర‌తిపాద‌న‌కు బీసీసీఐ అంగీక‌రిస్తే.. షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకుంటాయి.

భారత్, అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే..

* తొలి టీ20 మ్యాచ్ – సెప్టెంబర్ 13న‌
* రెండో టీ20 మ్యాచ్ – సెప్టెంబర్ 15న‌
* మూడో టీ20 మ్యాచ్ – సెప్టెంబర్ 17న‌