Mirabai Chanu : 28 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌.. ఆసియా గేమ్స్‌లో మీరాబాయి చానుకు ర‌జ‌తం..

ఆసియా క్రీడ‌ల్లో వెయిట్ లిఫ్ట‌ర్ మీరాబాయి చాను (Mirabai Chanu) ర‌జ‌త ప‌త‌కాన్ని సాధించింది.

After 28 years Mirabai Chanu ends Asian Games Medal wait with silver

Mirabai Chanu : ఆసియా క్రీడ‌ల్లో వెయిట్ లిఫ్ట‌ర్ మీరాబాయి చాను ర‌జ‌త ప‌త‌కాన్ని సాధించింది. మ‌హిళ‌ల 49 కేజీల విభాగంలో ఆమె ప‌త‌కాన్ని సాధించింది. ఆసియా క్రీడల్లో ఆమెకు ఇదే తొలి ప‌త‌కం. ఇక‌ ఆసియా క్రీడ‌ల్లో 28 ఏళ్ల త‌రువాత వెయిట్ లిఫ్టింగ్‌లో భార‌త్‌కు ఇదే మొద‌టి ప‌త‌కం కావ‌డం గ‌మ‌నార్హం. 1998లో బ్యాంకాక్ లో జ‌రిగిన ఆసియా క్రీడ‌ల్లో క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి 49 కేజీల విభాగంలో కాంస్య ప‌త‌కాన్ని సాధించింది.

బుధవారం నగోయాలో జరిగిన పోటీల్లో మీరాబాయి చాను మొత్తం 198 కిలోల బ‌రువును ఎత్తి రెండో స్థానంలో నిలిచింది. స్నాచ్‌లో 87 కేజీలు, క్లీన్ అండ్ జ‌ర్క్‌లో 111 కేజీలు ఎత్తింది. ఇక తొలి స్థానంలో ఉత్త‌ర‌కొరియా వెయిట్ లిఫ్ట‌ర్ రిసాంగ్ గ‌మ్ మొత్తం 215 కేజీలు ఎత్తింది. స్నాచ్‌లో 94 కిలోలు, క్లీన్ అండ్ జ‌ర్క్‌లో 121 కిలోలు ఎత్తి స్వ‌ర్ణ ప‌త‌కాన్ని సాధించింది. ఇండోనేషియాకు చెందిన లులుక్ డయానా ట్రి విజయన మొత్తం 191 కేజీల బరువు ఎత్తి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.

IND vs JPN : చారిత్ర‌క మ్యాచ్‌లో జపాన్ పై భార‌త్ విజ‌యం.. అతి క‌ష్టం మీద‌..

ప్ర‌పంచ ఛాంపియ‌న్ షిప్‌, ఒలిపింక్స్‌, కామ‌న్వెల్త్ ఇలా అంత‌ర్జాతీయ టోర్నీల్లో ఇప్ప‌టికే మీరా బాయి చాను అనేక ప‌త‌కాల‌ను సాధించింది. అయితే.. ఆసియా క్రీడ‌ల్లో ఆమె ప‌త‌కాన్ని సాధించ‌లేదు. నేటితో ఆ కోర‌త తీరిపోయిన‌ట్లైంది.

ప్ర‌ధాని మోదీ ప్ర‌శంస‌లు..

ఆసియా గేమ్స్‌లో ర‌త‌జ ప‌త‌కం సాధించిన మీరాబాయి చానుకు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ సోష‌ల్ మీడియాలో వేదిక‌గా అభినంద‌ల‌ను తెలియ‌జేశారు. ఆట ప‌ట్ల ఆమెకు ఉన్న అంకిత‌భావం ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతోంద‌ని చెప్పుకొచ్చారు. భ‌విష్య‌త్తులో ఆమె మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని ఆకాంక్షించారు.