SRH : కావ్యా పాప మాస్టర్ ప్లాన్.. నట్టూని మళ్లీ తీసుకొచ్చింది..
SRH : ఐపీఎల్ 2027 వేలానికి ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ట్రేడ్ జరిగింది.
Natarajan returns to SRH Ansari traded to Dehi Capitals
SRH : ఐపీఎల్ 2027 వేలానికి ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ట్రేడ్ జరిగింది. ట్రేడ్లోభాగంగా ఎడమ చేతి వాటం పేసర్ టి.నటరాజన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ తీసుకుంది. ఇందుకు బదులుగా లెగ్ స్పిన్నర్ జీషన్ అన్సారీని ఢిల్లీకి ఇచ్చేసింది.
ఐపీఎల్ 2025 మెగా వేలంలో నటరాజన్‌ను ఢిల్లీ రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది. అతడు ఢిల్లీ తరుపున రెండు సీజన్లు ఆడాడు. అయితే.. ఇప్పుడు రూ.5 కోట్ల సవరించిన ఫీజుతో అతడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో చేరనున్నాడు. మరోవైపు జీషన్‌ను అతడి ప్రస్తుత ఫీజు రూ.40లక్షలతోనే డీసీ తీసుకుంది. ఈ ట్రేడ్‌లో భాగంగా డీసీ ఖాతాలోకి రూ. 10.35 కోట్లు చేరనుండగా.. ఎస్ఆర్హెచ్ ఖాతా నుండి రూ. 4.6 కోట్లు తగ్గుతాయి.
Sanju Samson : అక్కడే మ్యాచ్ పోయింది.. సంజూ శాంసన్ కీలక వ్యాఖ్యలు..
గాయం కారణంగా నటరాజన్ 2025 సీజన్లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదు. అయితే.. ఐపీఎల్ 2026 సీజన్లో 10 మ్యాచ్‌లు ఆడి 11.18 ఎకానమీతో 5 వికెట్లు పడగొట్టాడు. కాగా.. గత సీజన్లో అతడు పెద్దగా రాణించనప్పటికి.. ఖచ్చితమైన యార్కర్లు, బోల్తా కొట్టించే స్లో బాల్స్‌తో అతడు ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టగలడు. అద్భుతమైన డెత్ బౌలర్.
View this post on Instagram
అతడు 2020 నుండి 2024 వరకు ఐదు సీజన్ల పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడాడు. ఆ సమయంలో నటరాజన్ ఎస్ఆర్హెచ్ తరుపున అద్భుతమైన ప్రదర్శన చేశాడు. 55 ఇన్నింగ్స్‌లలో 8.82 ఎకానమీతో 65 వికెట్లు పడగొట్టాడు. అతడి కెరీర్లో ఐపీఎల్ 2024లో అత్యుత్తమ సీజన్. ఆ సీజన్లో ఎస్ఆర్హెచ్ తరుపున 19 వికెట్లు తీసి.. జట్టు ఫైనల్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు.
మరోవైపు.. అన్సారీ ఐపీఎల్ 2026లో ఎస్ఆర్హెచ్ తరఫున తన అరంగేట్ర సీజన్లో అద్భుతంగా రాణించాడు. 10 మ్యాచ్‌లు ఆడి 6 వికెట్లు తీశాడు. ఎకానమీ 9.84.
ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 2027 వేలం డిసెంబర్ మధ్యలో గోవాలో జరగనుంది.
