T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ నుంచి నిష్ర్కమించినా ఇంకా భారత్‌లోనే వెస్టిండీస్, జింబాబ్వే జట్లు.. కారణం ఏంటో తెలుసా?
పొట్టి ప్రపంచకప్2026లో (T20 World Cup 2026) విండీస్, జింబాబ్వే ప్రస్థానం ముగిసినప్పటికి కూడా వారు ఇంకా భారతదేశాన్ని వీడలేదు.
- Thota Vamshi Kumar
- Published On : March 3, 2026 / 04:03 PM IST
After T20 World Cup 2026 exit West Indies and zimbabwe cricket teams departure from India has been postponed
- ప్రపంచకప్ నుంచి నిష్ర్కమించిన వెస్టిండీస్, జింబాబ్వే
- ఇంకా భారత్‌లోనే ఉన్న జట్లు
- అంతర్జాతీయ విమాన సరీస్వుల్లో అంతరాయమే కారణం
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8లో భాగంగా ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు ఓడిపోయింది. దీంతో సెమీస్ చేరకుండానే ఆ జట్టు టోర్నీ నుంచి నిష్ర్కమించింది. పొట్టి ప్రపంచకప్2026లో విండీస్ ప్రస్థానం ముగిసినప్పటికి కూడా వారు ఇంకా భారతదేశాన్ని వీడలేదు. మరికొన్ని రోజులు ఆ జట్టు భారత్‌లోనే ఉండనుంది. ఈ విషయాన్ని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలియజేసింది.
గల్ఫ్ ప్రాంతంలో భద్రతా సమస్యల కారణంగా తలెత్తిన అంతర్జాతీయ విమాన సరీస్వుల్లో అంతరాయమే ఇందుకు కారణం అని చెప్పింది. విండీస్ ప్లేయర్ల భద్రత, ప్రయాణం కోసం సంబంధిత అధికారులతో కలిపి పని చేస్తున్నామని తెలిపింది.
T20 World Cup 2026 : భారత్, ఇంగ్లాండ్ సెమీస్ మ్యాచ్‌కు అంపైర్లు వీరే..
‘గల్ఫ్ ప్రాంతంలో సైనిక చర్య వల్ల ప్రయాణ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. అనేక అంతర్జాతీయ విమాన మార్గాలు ప్రభావితం అయ్యాయి. భద్రతా కారణాల దృష్ట్యా ముందుగా షెడ్యూల్ చేసిన సర్వీసులను విమాన సంస్థలు రద్దు చేశాయి.’ అని విండీస్ క్రికెట్ బోర్డు తెలిపింది.
ఆటగాళ్లు, అధికారుల భద్రత, శ్రేయస్సు అత్యంత ప్రాధాన్యతగా ఉంటుందని బోర్డు హామీ ఇచ్చింది. విండీస్ జట్టు ప్రస్తుతం భారత్‌లోనే సురక్షితంగా ఉందని, పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు బోర్డు పేర్కొంది.
మా ప్రణాళికలు దెబ్బతిన్నాయి..
జింబాబ్వే జట్టు కూడా భారత్‌లోనే చిక్కుకుపోయింది. వాస్తవానికి జింబాబ్వే జట్టు దుబాయ్ నుంచి స్వదేశానికి వెళ్లాల్సి ఉంది. అయితే.. మిడిల్ ఈస్ట్ పరిస్థితుల కారణంగా దుబాయ్ విమానాశ్రయాన్ని మూసీ వేశారు. దీంతో తమ ప్రణాయ ప్రణాళికలు ప్రభావితం అయ్యాయని జింబాబ్వే క్రికెట్ బోర్డు తెలిపింది.
Travel disruptions delay Zimbabwe’s return from India 🛫 pic.twitter.com/5wVHGx7EnL
— Zimbabwe Cricket (@ZimCricketv) March 2, 2026
