T20 World Cup 2026 : టీ20 వరల్డ్‌కప్‌లో మరోసారి ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్..! ఫ్యాన్స్‌కు పండగే.. కానీ, ఇలా జరిగితేనే..
T20 World Cup 2026 :మరోసారి ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ వరల్డ్ కప్ టోర్నీలో ఇరు జట్ల మధ్య మరోసారి హైవోల్టేజ్ మ్యాచ్ ఖాయమని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
- Harishth Thanniru
- Published On : February 21, 2026 / 01:55 PM IST
T20 World Cup 2026
T20 World Cup 2026 : ఇండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే. ఇరు దేశాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా మ్యాచ్‌ను తిలకిస్తారు. టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీలో భాగంగా గ్రూప్ స్టేజ్‌లో ఇరు జట్లు తలపడ్డాయి. శ్రీలంక వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, మరోసారి ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ వరల్డ్ కప్ టోర్నీలో ఇరు జట్ల మధ్య మరోసారి హైవోల్టేజ్ మ్యాచ్ ఖాయమని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Also Read : T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ సూపర్ 8 ఫార్మాట్ పై ఐసీసీ ఎందుకు విమర్శలు ఎదుర్కొంటోంది?
టీ20 వరల్డ్ కప్ లో సూపర్-8కు గ్రూప్ – ఏ నుంచి పాకిస్థాన్, భారత్, గ్రూప్-బి నుంచి శ్రీలంక, జింబాంబ్వే, గ్రూప్-సీ నుంచి వెస్టిండీస్, ఇంగ్లాండ్, గ్రూప్- డీ నుంచి న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్లు చేరాయి. గ్రూప్- ఏ నుంచి సూపర్ 8కు చేరిన భారత్, పాకిస్థాన్ జట్లు మూడేసి మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. పాకిస్థాన్ జట్లు ఈనెల 21న న్యూజిలాండ్ జట్టుతో తలపడనుండగా.. 24న ఇంగ్లాండ్ జట్టుతో, 28న శ్రీలంక జట్టుతో తలపడనుంది. భారత జట్టు ఈనెల 22న దక్షిణాఫ్రికా జట్టుతో, 26న జింబాబ్వే, మార్చి 1న వెస్టిండీస్ జట్టుతో తలపడనున్నాయి.
సూపర్ -8 గ్రూప్-1లో భారత జట్టు మొదటి స్థానంలో ఉండి… అటు గ్రూప్ -2లో సెకండ్ స్థానాన్ని పాకిస్తాన్ దక్కించుకోవాలి. అలా జరిగితే సెమీఫైనల్స్‌లో పాకిస్థాన్ వర్సెస్ భారత్ జట్ల మధ్య మరోసారి హైవోల్టేజ్ మ్యాచ్ జరుగుతుంది. అలా కాకపోతే రెండు జట్లు కూడా వేరువేరు సెమీఫైనల్స్ మ్యాచ్‌లలో గెలిచి ఫైనల్‌కు వస్తే కూడా ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరిగే అవకాశం ఉంటుంది. భారత్ పాకిస్థాన్ జట్లు ఫైనల్స్ చేరితే కొలంబో వేదికగా తలపడే ఛాన్స్ ఉంటుంది. అయితే, జట్లు బలాబలాలను బట్టి క్రికెట్ పండితుల అంచనా ప్రకారం.. భారత్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, పాకిస్థాన్ జట్లు సెమీఫైనల్‌కు చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటున్నారు.
