MS Dhoni: విమానంలో ధోనీకి చాక్లెట్ ఇచ్చిన ఎయిర్ హోస్టెస్.. క్యాండీక్రష్ ఆడుతూ ఏం చేశాడంటే? వీడియో వైరల్
ధోనీ రాంచీకి విమానంలో వెళ్తున్న సమయంలో ఎయిర్ హోస్టెస్ చాక్లెట్ ఇచ్చింది. ధోనీ మాత్రం క్యాండీక్రష్ ఆడుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..
- Harish Thanniru
- Updated on- June 26, 2023 / 02:13 PM IST
MS Dhoni
Mahendra Singh Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) కి అభిమానులు ఎక్కువే. క్రికెట్లో మిస్టర్ ఫర్ఫెక్ట్, మిస్టర్ కూల్‌గా పేరుపొందిన ధోనీ.. తన రియల్ లైఫ్‌లోనూ అలానే ఉంటాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ 2023 (IPL 2023) లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) జట్టుకు సారథ్యం వహించిన ధోనీ, ఆ జట్టును విజేతగా నిలపడంలో కీలక భూమిక పోషించాడు. ఐపీఎల్ తరువాత ముంబైలో ధోనీ మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు.
MS Dhoni: శ్రీశాంత్‌తో కలిసి రోడ్ల మీద బైకుపై తిరిగిన ధోనీ.. వీడియో వైరల్
ఇటీవల ధోనీ రాంచీకి విమానంలో వెళ్తున్న సమయంలో ఎయిర్ హోస్టెస్ చాక్లెట్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. నితికా అనే ఎయిర్ హోస్టెస్ ట్రైలో చాక్లెట్స్ తీసుకొని ధోనీ వద్దకు వచ్చింది. అప్పటికే ధోనీ తన వద్ద ట్యాబ్‌లో క్యాండీక్రష్ గేమ్ ఆడుతున్నాడు. నితికా చాక్లెట్ ఇవ్వగా ట్రైలో నుంచి కేవలం ఒక్క చాక్లెట్ మాత్రమే ధోనీ తీసుకున్నాడు.. వెంటనే నితిక స్పందిస్తూ.. సార్.. ఇవన్నీ మీకేసార్ అని అనడంతో.. నోనో ఒక్కటి చాలు అంటూ ధోనీ నవ్వుతూ సైగ చేయడం వీడియోలో కనిపించింది.
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోలో ధోనీ క్యాండీక్రష్ ఆడుతున్నాడు. దీంతో నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఓ నెటిజన్.. ధోనీ సార్.. క్యాండీక్రష్ ఏ లెవల్ ఆడుతున్నారు అంటూ ప్రశ్నించాడు. మరికొందరు నెటిజన్లు.. ధోనీ దెబ్బకు క్యాండీక్రష్ డౌన్లోడ్స్ అమాంతం పెరిగిపోవటం ఖాయం అంటూ ట్వీట్లు చేశారు. వీడియో షేర్ చేసిన కొద్దిగంటల్లోనే 2లక్షల మందికిపైగా నెటిజన్లు వీక్షించడం గమనార్హం.
