WI vs UGA : 39 పరుగులకే ఉగాండా ఆలౌట్.. టీ20 ప్రపంచకప్‌లో చరిత్రలో వెస్టిండీస్‌కు అతి పెద్ద విజయం..
స్వదేశంలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ అదరగొడుతోంది. గ
- Thota Vamshi Kumar
- Updated on- June 9, 2024 / 09:31 AM IST
WI vs UGA
West Indies vs Uganda : స్వదేశంలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ అదరగొడుతోంది. గయానా వేదికగా ఉగాండాతో జరిగిన మ్యాచ్‌లో 134 పరుగుల భారీ తేడాతో విజయాన్ని సాధించింది. పొట్టి ప్రపంచకప్ చరిత్రలో పరుగుల పరంగా వెస్టిండీస్‌కు ఇదే అతి పెద్ద విజయం కాగా.. ఓవరాల్‌గా రెండో అతి పెద్ద గెలుపు కావడం విశేషం. 2007లో జోహన్నెస్‌బర్గ్ వేదికగా కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 172 పరుగుల తేడాతో గెలుపొందింది. అటు ఉగాండా టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యల్ప స్కోరును సమం చేసింది.
ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ చేసింది. జాన్సన్ చార్లెస్ (42 బంతుల్లో 44), ఆండ్రీ రస్సెల్ (17 బంతుల్లో 30 నాటౌట్) దంచికొట్టగా.. నికోలస్ పూరన్(22) , పావెల్ (23), రూథర్‌ఫర్డ్ (22) రాణించారు. ఉగాండా బౌలర్లలో బ్రియాన్ మసాబా రెండు వికెట్లు తీశాడు.
భారత్-పాక్ మ్యాచ్.. స్టేడియంలో ఈ సీటు ధర రూ.1.46 కోట్లు!
అనంతరం లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ బౌలర్ల ధాటికి ఉగాండా 12 ఓవర్లలో 39 పరుగులకే ఆలౌటైంది. ఉగాండా బ్యాటర్లలో జుమా మియాగి (13) ఒక్కడే రెండు అంకెల స్కోరు సాధించగా మిగిలిన వారు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. వెస్టిండీస్ బౌలర్లో అకీల్ హోసేన్ 5 వికెట్లతో ఉగాండా పతనాన్ని శాసించగా అల్జారీ జోసెఫ్ రెండు వికెట్లు తీశాడు. షఫర్డ్, రసెల్, మోతీ లు తలా ఓ వికెట్ సాధించారు.
టీ20 ప్రపంచకప్‌లో అత్యల్ప స్కోర్లు..
– 2014లో శ్రీలంక పై నెదర్లాండ్స్ 39 పరుగులకే ఆలౌట్
– 2024లో వెస్టిండీస్ పై ఉగాండా 39 పరుగులకే ఆలౌట్
– 2021లో శ్రీలంక పై నెదర్లాండ్స్ 44 పరుగులకే ఆలౌట్
– 2021లో ఇంగ్లాండ్ పై వెస్టిండీస్ 55 పరుగులకే ఆలౌట్
IND vs PAK : పాక్‌తో మ్యాచ్.. టీమ్ఇండియాకు భారీ షాక్.. స్టార్ ఓపెనర్‌కు గాయం..!
టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగుల తేడాతో విజయాలు సాధించిన జట్లు..
2007లో కెన్యా పై శ్రీలంక 127 పరుగులు
2024లో ఉగాండా పై వెస్టిండీస్ 134 పరుగులు
2021లో స్కాట్లాండ్ పై అఫ్గానిస్తాన్ 130 పరుగులు
2009లో స్కాట్లాండ్ పై సౌతాఫ్రికా 130 పరుగులు
2024లో ఉగాండా పై అఫ్గానిస్తాన్ 125 పరుగులు
