Anaya Bangar : సంజయ్ బంగర్ కూతురికి క్రికెట్ ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్.. రీఎంట్రీపై అనయ భావోద్వేగం..
భారత మాజీ క్రికెట్ సంజయ్ బంగర్ కూతురు అనయ బంగర్‌కు (Anaya Bangar) ఆస్ట్రేలియాలో కమ్యూనిటీ స్థాయిలో మహిళల క్రికెట్ ఆడేందుకు అనుమతి లభించింది
- Thota Vamshi Kumar
- Published on- August 27, 2026 / 07:11 PM IST
Anaya Bangar Breaks Silence After Landmark Cricket Australia Decision
Anaya Bangar : భారత మాజీ క్రికెట్ సంజయ్ బంగర్ కూతురు అనయ బంగర్‌కు ఆస్ట్రేలియాలో కమ్యూనిటీ స్థాయిలో మహిళల క్రికెట్ ఆడేందుకు అనుమతి లభించింది. దీంతో కొన్నేళ్లుగా పోటీ క్రికెట్‌కు దూరంగా ఉన్న ఆమె తిరిగి మైదానంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. 2027లో మహిళల బిగ్ బాష్ లీగ్‌లో ఆడే అవకాశాన్ని సాధించడమే ప్రస్తుతం తన లక్ష్యమని ఆమె వెల్లడించారు.
గతంలో ముంబై తరఫున వయసు విభాగాల పురుషుల క్రికెట్ ఆడిన అనయ.. 2022లో తన లింగ మార్పు ప్రక్రియను ప్రారంభించారు. ఈ ఏడాది మార్చిలో జెండర్-అఫర్మింగ్ సర్జరీ చేయించుకున్నారు.
IND vs SL : టీమ్ఇండియాకు భారీ షాక్.. సోనల్ దినూష వీరోచిత పోరాటం.. రెండో టెస్టు మ్యాచ్ డ్రా..
క్రికెట్ ఆస్ట్రేలియా తన పరిస్థితిని సమగ్రంగా పరిశీలించిన అనంతరం మహిళల క్రికెట్‌లోకి తిరిగి రావడానికి మార్గం కల్పించిందని అనయ చెప్పింది. తన వైద్య, శస్త్రచికిత్స చరిత్ర, హార్మోన్, టెస్టోస్టెరాన్ స్థాయిలు, గత క్రికెట్ అనుభవం, శిక్షణ వీడియోలు, అలాగే క్రీడా పనితీరుకు సంబంధించిన శాస్త్రీయ అధ్యయనాలను పరిశీలించినట్లు తెలిపింది. జూలైలో నిర్వహించిన రక్త పరీక్షలో తన టెస్టోస్టెరాన్ స్థాయి 0.6 నానోమోల్స్‌గా నమోదైందని వెల్లడించారు. 2027 మార్చిలో నిర్వహించే పరీక్షలోనూ అవసరమైన ప్రమాణాలను అందుకుంటే ఎలైట్ మహిళల క్రికెట్‌లో ఎంపిక కోసం పోటీ పడేందుకు అర్హత లభిస్తుందని వివరించారు.
క్రికెట్ ఆస్ట్రేలియా ఇచ్చింది కేవలం పోటీ పడే అవకాశం మాత్రమేనని, ఇతర ప్లేయర్ల మాదిరిగానే తాను కూడా శిక్షణ తీసుకుని, పోటీల్లో పాల్గొని, ప్రతిభను నిరూపించుకుని జట్టులో స్థానం సంపాదించుకోవాల్సి ఉందన్నారు. తన గతం లేదా వ్యక్తిగత గుర్తింపు కారణంగా జట్టులో చోటు పొందాలని తాను కోరుకోవడం లేదన్నారు.
#WATCH | Mumbai, Maharashtra: On making a comeback in cricket, Anaya Bangar, a cricketer and the daughter of former Indian international cricketer and national batting coach, Sanjay Bangar, said, “…I am preparing to return to women’s cricket in Australia with the aim of… pic.twitter.com/NVgrICOjgT
— ANI (@ANI) August 27, 2026
IND vs AFG : ఊహించని షాకిచ్చిన అఫ్గానిస్థాన్.. సందిగ్ధంలో టీ20 సిరీస్!
గతంలో భారత మహిళల క్రికెట్‌లో ఆడేందుకు అనుమతి కోరుతూ అనయ బీసీసీఐని సంప్రదించినప్పటికీ స్పందన రాలేదు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా 2023లో మహిళల అంతర్జాతీయ పోటీల్లో ట్రాన్స్‌జెండర్ అథ్లెట్ల పాల్గొనడంపై నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో లభించిన అవకాశం తనకు ఎంతో ముఖ్యమని అనయ చెప్పుకొచ్చింది.
🏏 ANAYA BANGAR EYES 2027 RETURN
Anaya Bangar is preparing to return to elite women’s cricket in Australia from March 2027, subject to Cricket Australia eligibility requirements and testosterone assessment.
She made it clear: I want my cricket to earn me a place on a cricket… pic.twitter.com/WzAEpTXILq
— Mufaddal Atif (@MufaddalAtif) August 27, 2026
క్రికెట్ తన జీవితంలో ఎంతో ముఖ్యమైన భాగమని, ట్రాన్సిషన్ సమయంలో ఈ క్రీడకు తాను దూరమవుతానేమోనని భయపడ్డానని చెప్పారు. తిరిగి మైదానంలోకి రావడానికి ఎన్నో సంవత్సరాలు ప్రయత్నించినట్లు వెల్లడించారు. ఇప్పుడు మళ్లీ పోటీ క్రికెట్‌లో తన సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం లభించిందని, 2027లో ఎలైట్ మహిళల క్రికెట్‌తో పాటు మహిళల బిగ్ బాష్ లీగ్‌లో స్థానం కోసం కష్టపడతానని అనయ చెప్పింది.
