Virushka COVID Aid : కొవిడ్ బాధితులకు విరుష్క సాయం.. వారం రోజుల్లేనే 11 కోట్లు

కోవిడ్‌ బాధితుల్ని ఆదుకునేందుకు ముందుకొచ్చిన విరాట్‌కోహ్లీ, అనుష్క దంపతులు అనుకున్నది సాధించారు. వారం రోజుల్లోనే 11 కోట్ల విరాళాలు సేకరించారు. 7 కోట్లు కలెక్ట్‌ చేయాలని టార్గెట్‌ పెట్టుకోగా.. ఇప్పటిదాకా 11కోట్ల దాకా డొనేషన్స్‌ అందాయి.

Anushka Virat COVID Aid : కోవిడ్‌ బాధితుల్ని ఆదుకునేందుకు ముందుకొచ్చిన విరాట్‌కోహ్లీ, అనుష్క దంపతులు అనుకున్నది సాధించారు. వారం రోజుల్లోనే 11 కోట్ల విరాళాలు సేకరించారు. 7 కోట్లు కలెక్ట్‌ చేయాలని టార్గెట్‌ పెట్టుకోగా.. ఇప్పటిదాకా 11కోట్ల దాకా డొనేషన్స్‌ అందాయి. కోవిడ్ బాధితులకు 2 కోట్ల భారీ విరాళం ప్రకటించిన కోహ్లీ దంపతులు… తమతో కలిసి రావాలని అందరికీ పిలుపునిచ్చారు.

దీని కోసం ఓ క్యాంపెయిన్‌ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన ఈ జంట.. తమ మిత్రులు, అభిమానులతో పాటు ప్రతీ ఒక్కరు తమకు తోచిన మొత్తాన్ని విరాళంగా ఇవ్వాలని కోరారు. దీంతో ఎంపీఎల్‌ స్పోర్ట్స్‌ అకాడమీ 5కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించింది. వీరితో పాటు మరో 4 కోట్లు కలెక్ట్‌ చేసిన విరుష్క జంట… మొత్తం 11 కోట్లను దేశంలో కోవిడ్‌ బాధితుల కోసం ఉపయోగించనుంది.

‘రబ్ నే బనా డి జోడి’ స్టార్ ట్విట్టర్‌లో కరోనా బాధితుల కోసం విరాళాలు సేకరణ లక్ష్యాన్ని పెంచినట్టు ప్రకటించారు. భారత మహమ్మారిపై పోరాటంలో తమ ప్రయత్నాలను బలోపేతం చేసినందుకు ఎంపిఎల్ స్పోర్ట్స్ ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు, విరుష్క జంట రూ. 7 కోట్ల రూపాయల విరాళాలను సేకరించాలనే ఉద్దేశ్యంతో నిధుల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కోవిడ్ -19 సహాయక చర్యలకు నిధుల సేకరణ క్యాంపెయిన్ ద్వారా రూ .5 కోట్లు సేకరించారు.

కరోనాపై పోరాటంలో ముందుండి సేవలు అందిస్తున్న ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ను హీరోలుగా అభివర్ణించిన కోహ్లీ… వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు. ఇక వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించే క్రమంలో గతవారం టీకా తొలి డోసు తీసుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు