Arshdeep Singh : నువ్వు మామూలోడివి కాదు సామీ.. బుమ్రాకు నో ప్లేస్‌.. అశ్విన్‌కు క్ష‌మాప‌ణ‌లు.. అర్ష్‌దీప్ సింగ్ టాప్‌-5 బౌల‌ర్లు వీరే..

భార‌త క్రికెట్‌లో టాప్‌-5 బౌల‌ర్ల జాబితాను అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) వెల్ల‌డించాడు.

Arshdeep Singh Picks His Top 5 Indian Bowlers

Arshdeep Singh : అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో భార‌త్ త‌రుపున అత్య‌ధిక టీ20 వికెట్లు తీసిన బౌల‌ర్‌గా అర్ష్‌దీప్ సింగ్ నిలిచాడు. కాగా.. ఈ ఎడ‌మ‌చేతి వాటం పేస‌ర్ త‌న‌కు న‌చ్చిన భార‌త టాప్‌-5 బౌల‌ర్ల జాబితాను వెల్ల‌డించాడు. ఆశ్చ‌ర్య‌క‌రంగా.. ప్ర‌స్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో అత్యుత్త‌మ బౌల‌ర్ల‌లో ఒక‌రిగా గుర్తింపు పొందిన భార‌త పేస్ గుర్రం జ‌స్‌ప్రీత్ బుమ్రాకు ఈ జాబితాలో చోటు ద‌క్క‌లేదు.

కృష్ణాంక్ అత్రే యూట్యూబ్ ఛానెల్‌లో అర్ష్‌దీప్ సింగ్ మాట్లాడుతూ.. ఈ జాబితాను వెల్ల‌డించాడు. ఇందుకు గ‌ల కార‌ణాల‌ను తెలియ‌జేశాడు. భువ‌నేశ్వ‌ర్ కుమార్‌ను నంబ‌ర్ స్థానంలో ఉంచాడు. భువీ అంటే నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం. అందుకే కొంచెం పక్షపాతం చూపించాను. ముఖ్యంగా కొత్త బంతితో అత‌డు స్వింగ్ రాబ‌ట్టే విధానం అద్భుతం అని అన్నాడు.

IND vs SL : శ్రీలంక‌తో టెస్టు సిరీస్‌కు ముందు భార‌త్‌కు భారీ షాక్‌.. జ‌స్‌ప్రీత్ బుమ్రా దూరం.. అత‌డి స్థానంలో ఎవ‌రంటే?

ఇక రెండో స్థానంలో మ‌హ‌మ్మ‌ద్ ష‌మీని ఎంపిక చేశాడు. ఎలాంటి పిచ్‌పైనా అయినా కూడా బంతిని సీమ్ చేయ‌గ‌ల నైపుణ్యం అత‌డి సొంతం అని చెప్పుకొచ్చాడు. ఆయన సీమ్ ప్రెజెంటేషన్ అద్భుతంగా ఉంటుందని ప్రశంసించాడు.

ఇక మూడో స్థానంలో స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్‌కు నాలుగో స్థానంలో యుజ్వేంద్ర చాహ‌ల్‌కు చోటు ఇచ్చాడు. ‘మూడో స్థానంలో కుల్దీప్ యాదవ్ ఉంటాడు.. ఎందుకంటే అతనికి చాలా అరుదైన నైపుణ్యం ఉంది. అతను ఎడమచేతి చైనామన్ బౌలర్. ఆ తర్వాత చాహ‌ల్. మేము పంజాబ్ జట్టులో సహచరులం, అతని రికార్డు కూడా అద్భుతంగా ఉంది. అతను చాలా వికెట్లు తీశాడు.’ అని అర్ష్‌దీప్ అన్నాడు.

Commonwealth Games 2026 : కామన్వెల్త్ గేమ్స్ 2026.. పతకాల సంఖ్య తగ్గినా… భారత ప్రదర్శన అసాధారణమే!

ఇక ఐదో స్థానంలో ర‌విచంద్ర‌న్ అశ్విన్‌ను ఉంచాడు. జాబితాలో చివ‌రి స్థానంలో ఉంచినందుకు మాజీ స్పిన్న‌ర్‌కు అర్ష్‌దీప్ సింగ్ స‌ర‌దాగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు. అశ్విన్‌ను చివరి స్థానంలో ఉంచాలని నాకు లేదు. కానీ వేరే స్థానాలు లేక‌పోవ‌డంతోనే ఆయ‌న‌కు ఐదో స్థానం ఇచ్చాను. ఆయ‌నో గొప్ప బౌల‌ర్‌. ఐపీఎల్‌లో పంజాబ్ తరఫున నేను ఆడిన‌ప్పుడు నా తొలి కెప్టెన్ అత‌డే. ఐదో స్థానంలో ఉంచినందుకు నేను వ్య‌క్తిగతంగా మెసేజ్ చేసి క్ష‌మాప‌ణ‌లు చెబుతాను అని న‌వ్వుతూ తెలిపాడు.