×
Ad

Asia Cup Rising Stars 2026 : ఫైన‌ల్‌కు చేరుకున్న భార‌త్‌.. సెమీస్‌లో శ్రీలంక పై ఘ‌న విజ‌యం..

మ‌హిళ‌ల ఆసియాక‌ప్ రైజింగ్ స్టార్స్ 2026లో (Asia Cup Rising Stars 2026) భార‌త-ఏ జ‌ట్టు అద‌ర‌గొడుతోంది

Asia Cup Rising Stars 2026 India A Women won by 5 wickets against Srilanka A

Asia Cup Rising Stars 2026 : మ‌హిళ‌ల ఆసియాక‌ప్ రైజింగ్ స్టార్స్ 2026లో భార‌త-ఏ జ‌ట్టు అద‌ర‌గొడుతోంది. వ‌రుస విజ‌యాల‌తో ఫైన‌ల్ లో అడుగుపెట్టింది. శుక్ర‌వారం థాయ్‌లాండ్ రాజ‌ధాని బ్యాంకాక్ వేదిక‌గా జ‌రిగిన సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో శ్రీలంక-ఏ జ‌ట్టు పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఈ మ్యాచ్‌లో శ్రీలంక జ‌ట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. 19.4 ఓవ‌ర్ల‌లో 118 ప‌రుగుల‌కు ఆలౌటైంది. లంక బ్యాట‌ర్ల‌లో సంజన కవిండి (31; 35 బంతుల్లో 5 ఫోర్లు), శశినీ గిమ్హాని (22; 17 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌) రాణించారు. భార‌త బౌల‌ర్ల‌లో కెప్టెన్ రాధా యాద‌వ్ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టింది. ప్రేమ రావత్, తనుజా కన్వర్ లు చెరో రెండు వికెట్లు తీశారు. సైమా ఠాకూర్, మిన్ను మణి లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజ‌న్‌కు ముందు సీఎస్‌కేకు భారీ షాక్.. 14.20 కోట్ల స్టార్ ఆట‌గాడికి గాయం!


అనంత‌రం బృందా దినేష్ (42; 20 బంతుల్లో 8 ఫోర్లు), కెప్టెన్ రాధా యాద‌వ్ (31 నాటౌట్; 18 బంతుల్లో 7 ఫోర్లు), అనుష్క శర్మ(27; 18 బంతుల్లో 5 ఫోర్లు) రాణించ‌డంతో 119 ప‌రుగుల ల‌క్ష్యాన్ని భార‌త్-ఏ జ‌ట్టు 13.3 ఓవ‌ర్ల‌లో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. లంక బౌల‌ర్ల‌లో శశినీ గిమ్హాని రెండు వికెట్లు తీసింది. యసంతి నిమంతిక ఓ వికెట్ ప‌డ‌గొట్టింది. భార‌త విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన కెప్టెన్ రాధా యాద‌వ్ ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకుంది.

T20 World Cup 2026 : జింబాబ్వే చేతిలో ఓట‌మిపై స్పందించిన శ్రీలంక కెప్టెన్.. నిజం చెప్పాలంటే

ఆదివారం (ఫిబ్ర‌వ‌రి 22) ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. బంగ్లాదేశ్‌, పాకిస్థాన్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగే రెండో సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో విజేత‌గా నిలిచిన జ‌ట్టుతో ఆదివారం ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది.