Asian Games 2026 : ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. అదరగొట్టిన ఆర్చరీ జట్టు.. తెలుగు అమ్మాయిలకు గోల్డ్..
ఆసియా క్రీడల్లో (Asian Games 2026) భారత్ ఖాతాలో మరో స్వర్ణం వచ్చి చేరింది.
- Thota Vamshi Kumar
- Updated on- September 30, 2026 / 09:25 AM IST
Asian Games 2026 India Womens Compound Archery Team Wins Gold
Asian Games 2026 : ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం వచ్చి చేరింది. మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్‌లో చైనాను ఓడించి మరీ గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకుంది. ఆసియా క్రీడలు 2026లో భారత్‌కు ఇది ఏడో స్వర్ణం.
ఇక ఇప్పటి వరకు భారత్ ఖాతాలో 54 పతకాలు ఉన్నాయి. ఇందులో ఏడు స్వర్ణాలు, 21 రజతాలు, 26 కాంస్య పతకాలు ఉన్నాయి. పాయింట్ల పట్టికలో భారత్ 9వ స్థానంలో కొనసాగుతోంది.
బుధవారం జ్యోతి సురేఖ వెన్నం, ప్రతీకా ప్రదీప్, చికిత తానిపర్తి లతో కూడిన మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టు ఫైనల్‌లో చైనాను 238-234 స్కోరుతో ఓడించి గోల్డ్ మెడల్‌ను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో భారత మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టు (238) దక్షిణ కొరియా పేరిట ఉన్న ప్రపంచ రికార్డును సమం చేశారు. 2014లో ఇంచియాన్ ఆసియా క్రీడల సందర్భంగా కొరియా ఈ రికార్డును సాధించింది.
The smiles say it all. 🥇🇮🇳
Chikitha Taniparthi, Prithika Pradeep and Jyothi Surekha Vennam celebrate a golden day at #AichiNagoya2026. ✨#AsianGames pic.twitter.com/eZzWwJIkKL
— Olympic Khel ™ (@OlympicKhel) September 30, 2026
ఇక భారత జట్టులోని జ్యోతి సురేఖ, చికిత తానిపర్తి తెలుగు అమ్మాయిలు కావడం విశేషం. జ్యోతి సురేఖ విజయవాడకు చెందిన అమ్మాయి కాగా.. చికిత ది పెద్దపల్లి. ఇక ప్రతీకా ప్రదీప్ విషయానికి వస్తే ఆమెది మహారాష్ట్ర.
