IND vs PAK : ఆసియా క్రీడల్లో టీమ్ఇండియాకు స్వర్ణం.. ఫైనల్‌లో పాక్ పై భారత్ ఘన విజయం..
ఆసియా క్రీడలు 2026లో భారత పురుషుల క్రికెట్ జట్టు ఫైనల్ మ్యాచ్‌లో పాక్‌ను (IND vs PAK) ఓడించి గోల్డ్ మెడల్‌ను సాధించింది.
- Thota Vamshi Kumar
- Updated on- October 3, 2026 / 01:38 PM IST
Asian Games 2026 Team India Mens cricket Team won gold medal
IND vs PAK : ఆసియా క్రీడలు 2026లో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం వచ్చింది. పురుషుల క్రికెట్‌లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమ్ఇండియా ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేసి గోల్డ్ మెడల్‌ను కైవసం చేసుకుంది. కాగా.. ఇదే క్రీడల్లో ఇంతకముందు భారత మహిళల జట్టు కూడా స్వర్ణ పతకం గెలుచుకున్న సంగతి తెలిసిందే.
ఫైనల్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు సాధించింది. టీమ్ఇండియా బ్యాటర్లలో అభిషేక్ శర్మ (61; 28 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లు), తిలక్ వర్మ (51 నాటౌట్; 22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) లు హాఫ్ సెంచరీలతో రాణించారు. శివమ్ దూబె (27; 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడాడు.
సంజూ శాంసన్ (2) ఘోరంగా విఫలం కాగా.. వైభవ్ సూర్యవంశీ (15), ఇషాన్ కిషన్ (20), శ్రేయస్ అయ్యర్ (21) పర్వాలేదనిపించారు. పాక్ బౌలర్లలో అరఫత్ మిన్హాస్, అహ్మద్ డానియాల్ లు చెరో రెండు వికెట్లు తీయగా.. సైమ్ అయూబ్, అబ్రార్ అహ్మద్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
𝗚𝗢𝗟𝗗 𝗠𝗘𝗗𝗔𝗟𝗟𝗜𝗦𝗧𝗦 𝗔𝗚𝗔𝗜𝗡 🥇
Congratulations #TeamIndia for successfully defending the Asian Games Gold Medal 👏👏
Scorecard ▶️ https://t.co/g4wzZagyGj#AsianGames pic.twitter.com/sg7z4dhUzH
— BCCI (@BCCI) October 3, 2026
అనంతరం 212 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 192 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 19 పరుగుల తేడాతో గెలుపొందింది. పాక్ బ్యాటర్లలో హసన్ నవాజ్ (96; 51 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ రెండు, వాషింగ్టన్ సుందర్, శివద్ దూబెలు తలా రెండు వికెట్లు పడగొట్టారు.
