IND-W vs SL-W : ఆసియా క్రీడలు ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. గెలిస్తే స్వర్ణం.. తుది జట్టులో ఎవరెవరు అంటే?
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భాగంగా మహిళల క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, శ్రీలంక మహిళల జట్లు (IND-W vs SL-W )తలపడుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Updated on- September 22, 2026 / 10:26 AM IST
Asian Games 2026 womens cricket final match India opt to bat
IND-W vs SL-W : జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భాగంగా మహిళల క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, శ్రీలంక మహిళల జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో శ్రీలంక జట్టు తొలుత బౌలింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోనుండగా ఓడిన పోయిన జట్టు రజతాన్ని అందుకోనుంది.
కాగా.. అంతక ముందు జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి పాకిస్థాన్ మహిళల జట్టు కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.
శ్రీలంక తుది జట్టు..
ఇమేషా దులానీ, చమరి అథాపత్తు(కెప్టెన్), హాసిని పెరెరా, హర్షిత సమరవిక్రమ, కవిషా దిల్హరి, హన్సీమా కరుణరత్నే, కౌషని నుత్యాంగన(వికెట్ కీపర్), మిథాలీ అయోధ్య, కావ్య కవింది, చాముది ప్రభోద, సుగండిక కుమారి
భారత తుది జట్టు..
స్మృతి మంధాన, షఫాలీ వర్మ, గుణాలన్ కమలిని, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), రిచా ఘోష్(వికెట్ కీపర్), భారతీ ఫుల్మాలి, దీప్తి శర్మ, శ్రేయంక పాటిల్, శ్రీ చరణి, నందనీ శర్మ, క్రాంతి గౌడ్
