Asian Games : భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. ఇరాన్‌ను ఓడించి గోల్డ్ గెలుచుకున్న మహిళల కబడ్డీ జట్టు..
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో (Asian Games) భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం వచ్చి చేరింది.
- Thota Vamshi Kumar
- Updated on- September 26, 2026 / 11:24 AM IST
Asian Games India womens Kabaddi team clinches gold
Asian Games : జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం వచ్చి చేరింది. మహిళల కబడ్డీ పోటీల్లో ఇరాన్ పై భారత్ అద్భుత విజయం సాధించి గోల్డ్ మెడల్‌ను గెలుచుకుంది. దీంతో ఈ మెగా ఈవెంట్‌లో భారత్ స్వర్ణ పతకాల సంఖ్య మూడుకు చేరింది. అంతక ముందు మహిళల క్రికెట్‌లో, 10 మీటర్ల ఎయిర్ పిస్టర్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత్ గోల్డ్ మెడల్స్ గెలుచుకుంది.
కబడ్డీ ఫైనల్ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ఇరు జట్లు పాయింట్ల కోసం హోరాహోరీగా తలపడ్డాయి. చివరికి భారత్ 37-33 తేడాతో గెలుపొందింది. ఆసియా క్రీడల్లో మహిళల కబడ్డీలో భారతదేశానికి ఇది నాలుగో స్వర్ణ పతకం కావడం విశేషం. భారత జట్టు గతంలో 2010, 2014, 2022లలో స్వర్ణం గెలుచుకోగా.. 2018లో రన్నరప్‌గా నిలిచింది.
ఇదిలా ఉంటే.. ఆసియా క్రీడలు 2026లో ఇప్పటి వరకు భారత్ 26 పతకాలను సాధించింది. ఇందులో మూడు గోల్డ్, 11 రజతాలు, 12 క్యాంస పతకాలు ఉన్నాయి.
