AUS vs BAN : ప్రతీకారం తీర్చుకున్న ఆస్ట్రేలియా.. బంగ్లాదేశ్‌కు భారీ షాక్.. రెండ్రోజుల్లోనే ఫినీష్

AUS vs BAN : ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్‌లో ఆసీస్ ఘన విజయం సాధించింది.

AUS vs BAN Test Match

AUS vs BAN : ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్‌లో ఆసీస్ ఘన విజయం సాధించింది. తొలి టెస్టులో అనూహ్య ఓటమితో విమర్శల పాలైన ఆస్ట్రేలియా ఆటగాళ్లు.. రెండో టెస్టులో కసితో రాణించారు. గాయపడిన సింహంలా ప్రత్యర్థి జట్టుపై విరుచుకుపడ్డారు.. ఫలితంగా బంగ్లాదేశ్ జట్టుకు భారీ షాకిచ్చారు. దీంతో తమతో ఆషామాషీగా ఉండదంటూ కంగారు ఆటగాళ్లు చూపించారు.

Also Read : IND vs SL 2nd Test : ఇండియా వర్సెస్ శ్రీలంక రెండో టెస్ట్ మ్యాచ్.. టాస్ గెలిచిన భారత్.. కుల్దీప్ ఔట్.. సారాంశ్‌ ఎంట్రీ

ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య టెస్టు సిరీస్ జరుగుతోంది. తొలి టెస్టులో ఆస్ట్రేలియాకు బంగ్లాదేశ్ గట్టి షాకిచ్చింది. అద్భుత విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లపై విమర్శలు వెల్లువెత్తాయి. అప్పటి నుంచి ప్రతీకారంతో రగిలిపోతున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు.. శనివారం నుంచి ప్రారంభమైన రెండో టెస్టులో విజృంభించారు. కేవలం రెండు రోజుల్లో టెస్టు మ్యాచ్‌ను పూర్తిచేసి బంగ్లాదేశ్ జట్టును మట్టికరిపించారు. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు కేవలం 64 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 210 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ తడబడింది. కేవలం 95 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో బంగ్లాపై ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో ఈఘన విజయం సాధించింది. స్వల్ప స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్ కేవలం రెండోరోజు సెకండ్ సెషన్ తొలి ఓవర్లోనే ముగియడం గమనార్హం.

బంగ్లాదేశ్ జట్టు బ్యాటర్లను ఆసీస్ బౌలర్లు మిచెల్ స్టార్క్, పాట్ కమ్మిన్స్ బెంబేలెత్తించారు. క్రీజులో పాతుకుపోయే అవకాశం బంగ్లా బ్యాటర్లు ఏమాత్రం ఇవ్వంలేదు. వెంటవెంటనే వికెట్లను పడగొట్టారు. దీంతో తొలి ఇన్నింగ్స్ లో కేవలం 12 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టిన మిచెల్ స్టార్క్ రెండో ఇన్నింగ్స్ లోనూ విజృంభించాడు. 39 పరుగులకే నాలుగు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో 25 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టిన పాట్ కమ్మిన్స్.. రెండో ఇన్నింగ్స్ లో 10 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. బంగ్లాదేశ్ జట్టుపై అద్భుత విజయం సాధించడంలో ఇద్దరు బౌలర్లు కీలక భూమిక పోషించారు.