AUS vs ENG : మూడో టెస్టుకు ఆసీస్ తుది జట్టు ఇదే.. కెప్టెన్ వచ్చేశాడు.. సీనియర్‌కు మొండిచేయి..
యాషెస్ సిరీస్ 2025-26లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య (AUS vs ENG) అడిలైడ్ ఓవల్ వేదికగా డిసెంబర్ 17 నుంచి 21 వరకు మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది.
- Thota Vamshi Kumar
- Published On : December 16, 2025 / 11:20 AM IST
AUS vs ENG 3rd Test Pat Cummins returns Australia two changes
AUS vs ENG : యాషెస్ సిరీస్ 2025-26లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య అడిలైడ్ ఓవల్ వేదికగా డిసెంబర్ 17 నుంచి 21 వరకు మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ టెస్టు మ్యాచ్‌కు ఒక రోజు ముందు క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది.
గాయం కారణంగా తొలి రెండు టెస్టులకు దూరమైన రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ తిరిగి వచ్చాడు. అతడితో పాటు వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్ కూడా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆల్ రౌండర్ మైఖేల్ నేసర్, సీమర్ బ్రెండన్ డాగెట్ లు జట్టులో చోటు కోల్పోయారు.
వెన్నుగాయం నుంచి కోలుకున్నప్పటికి కూడా ఉస్మాన్ ఖవాజాకు జట్టులో చోటు దక్కలేదు. దీంతో మరోసారి ట్రవిస్ హెడ్ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. అతడితో పాటు జేక్ వెదరాల్డ్ మరో ఓపెనర్‌గా రానున్నాడు.
తొలి రెండు టెస్టు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ఆసీస్ ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు ఇంగ్లాండ్ ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి ఆసీస్ ఆధిక్యాన్ని తగ్గించాలని అనుకుంటోంది.
ఆసీస్ తుది జట్టు ఇదే..
ట్రవిస్ హెడ్, జేక్ వెదరాల్డ్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, కామెరాన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ క్యారీ, పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్.
ఇంగ్లాండ్ తుది జట్టు ఇదే..
జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్, విల్ జాక్స్, జోష్ టంగ్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్.
