IPL 2026 Auction : ఐపీఎల్ 2026 మినీ వేలానికి వేళాయే.. ఏ జట్టు వద్ద ఎంత నగదు, ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే?
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 మినీ వేలానికి (IPL 2026 Auction) సమయం దగ్గర పడింది.
IPL 2026 auction tomorrow team purse value details here
IPL 2026 Auction : క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 మినీ వేలానికి సమయం దగ్గర పడింది. మంగళవారం (డిసెంబర్ 16) అబుదాబి వేదికగా వేలం జరగనుంది. తమకు కావాల్సిన ఆటగాళ్లను కొనుగోలు చేసి, జట్లను పటిష్టం చేసుకునేందుకు అన్ని ప్రాంఛైజీలు ఇప్పటికే తమ తమ వ్యూహాలను సిద్ధం చేసుకున్నాయి.
మొత్తం పది జట్లలో గరిష్టంగా 77 ఖాళీలు ఉన్నాయి. ఇందుకోసం 359 మంది ప్లేయర్లు పోటీపడుతున్నారు. వీరిలో 110 మంది అంతర్జాతీయ ప్లేయర్లు ఉన్నారు. 10 ఫ్రాంచైజీలు కలిపి రూ.237.55 కోట్లు ఖర్చు చేయనున్నాయి.
వేలం జరిగే సమయం ఇదే..
వేలం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కానుంది. టీవీల్లో స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇక ఓటీటీలో జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
ఏ ఫ్రాంచైజీ వద్ద ఎంత నగదు ఉంది? ఎన్ని స్థానాలు ఖాళీగా ఉన్నాయంటే. ?
కోల్‌కతా నైట్ రైడర్స్..
కేకేఆర్ వద్ద రూ 64.30 కోట్లు అందుబాటులో ఉన్నాయి. 13 మంది ప్లేయర్లను కొనుగోలు కొనుగోలు చేయొచ్చు. ఇందులో 6 స్లాట్స్ విదేశీ ఆటగాళ్లు.
Lionel Messi : ఢిల్లీలో మెస్సీ మేనియా.. హ్యాండ్ షేక్ కోసం కోటి రూపాయలు..!
చెన్నై సూపర్ కింగ్స్..
సీఎస్‌కే వద్ద రూ.43.40 కోట్లు అందుబాటులో ఉన్నాయి. 9 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయొచ్చు. ఇందులో 4 స్లాట్స్ విదేశీ ఆటగాళ్లు.
సన్‌రైజర్స్ హైదరాబాద్..
సన్‌రైజర్స్ హైదరాబాద్ వద్ద రూ.25.50 కోట్లు అందుబాటులో ఉన్నాయి. 10 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయొచ్చు. ఇందులో 2 స్లాట్స్ విదేశీ ఆటగాళ్లు..
లక్నో సూపర్ జెయింట్స్..
లక్నో సూపర్ జెయింట్స్ వద్ద రూ.22.95 కోట్లు అందుబాటులో ఉన్నాయి. 6 గురు ఆటగాళ్లను కొనుగోలు చేయొచ్చు. 4 స్లాట్స్ విదేశీ ఆటగాళ్లు.
ఢిల్లీ క్యాపిటల్స్..
ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద రూ.21.8 కోట్లు అందుబాటులో ఉన్నాయి. 8 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయొచ్చు ఇందులో 5 స్లాట్స్ విదేశీ ఆటగాళ్లు..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వద్ద రూ.16.4 కోట్లు అందుబాటులో ఉన్నాయి. 7 గురు ప్లేయర్లను కొనుగోలు చేయొచ్చు. ఇందులో 2 స్లాట్స్ విదేశీ ఆటగాళ్లు.
రాజస్థాన్ రాయల్స్..
రాజస్థాన్ రాయల్స్ వద్ద రూ.16.05 కోట్లు అందుబాటులో ఉన్నాయి. 9 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయొచ్చు. ఇందులో ఒక స్లాట్ విదేశీ ప్లేయర్
గుజరాత్ టైటాన్స్..
గుజరాత్ టైటాన్స్ వద్ద రూ.12.9 కోట్లు అందుబాటులో ఉన్నాయి. 5 గురు ఆటగాళ్లను కొనుగోలు చేయొచ్చు. ఇందులో 4 స్లాట్స్ విదేశీ ఆటగాళ్లు..
పంజాబ్ కింగ్స్..
పంజాబ్ కింగ్స్ వద్ద రూ.11.5 కోట్లు అందుబాటులో ఉన్నాయి. 4 గురు ఆటగాళ్లను కొనుగోలు చేయొచ్చు. ఇందులో 2 స్లాట్స్ విదేశీ ఆటగాళ్లు.
ముంబై ఇండియన్స్..
ముంబై ఇండియన్స్ వద్ద రూ.2.75 కోట్లు అందుబాటులో ఉన్నాయి. 5 గురు ఆటగాళ్లను కొనుగోలు చేయొచ్చు. ఇందులో ఒక స్లాట్ విదేశీ ప్లేయర్.
