Abhishek Sharma : నన్ను నమ్మండి.. సూర్య, గిల్‌లు ప్రపంచకప్ మ్యాచ్‌లను గెలిపిస్తారు.. అభిషేక్ శర్మ కామెంట్స్..
టీ20ల్లో పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ లకు టీమ్ఇండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma ) మద్దతుగా నిలిచాడు.
Abhishek Sharma comments Trust me Suryakumar and Shubman will win matches for India in World Cup
Abhishek Sharma : టీ20ల్లో పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ లకు టీమ్ఇండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ మద్దతుగా నిలిచాడు. ధర్మశాల వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో మూడో టీ20లో మ్యాచ్‌లో గిల్, సూర్య ఇద్దరూ విఫలం అయ్యారు. గిల్ బంతికో పరుగు చొప్పున 28 పరుగులు చేయగా.. సూర్యకుమార్ యాదవ్ 11 బంతుల్లో కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో ఫామ్ లేమీతో ఇబ్బంది పడుతున్న గిల్, సూర్యలపై సోషల్ మీడియా వేదికగా విమర్శల జడివాన కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలోనే వీరిద్దరికి అభిషేక్ శర్మ మద్దతుగా నిలిచాడు. వచ్చే ఏడాది స్వదేశంలో జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో వీరిద్దరు అదరగొడతారని, మ్యాచ్‌లు గెలిపిస్తారని జోస్యం చెప్పాడు.
Rohit Sharma : క్రికెట్ దేవుడితో ఫుట్‌బాల్ గ్రేట్.. మారుమోగిన రోహిత్ శర్మ పేరు..
మూడో టీ20 మ్యాచ్ అనంతరం అభిషేక్ శర్మ మాట్లాడుతూ.. నన్ను నమ్మండి సూర్య, గిల్‌లు ఇద్దరూ వచ్చే టీ20 ప్రపంచకప్‌లో మ్యాచ్‌లను గెలిపిస్తారు. వారిద్దరితో నేను చాలా కాలంగా కలిసి ఆడుతున్నాను. ముఖ్యంగా గిల్‌తో ఎన్నో ఏళ్లుగా ఆడుతున్నా. అతడికి ఏ పరిస్థితుల్లో ఎలా ఆడాలో బాగా తెలుసు. నాకు అతడిపై పూర్తి నమ్మకం ఉంది. మీ అందరికి కూడా త్వరలోనే నమ్మకం వస్తుంది అని అన్నాడు.
గిల్, సూర్యలు ధర్మశాలలో ఇబ్బంది పడగా.. అభిషేక్ ఎప్పటిలాగే పరుగుల వేటను కొనసాగించాడు. 118 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌కు మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. 18 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 35 పరుగులు చేశాడు.
2025లో గిల్, సూర్యల టీ20 గణాంకాలు ఇవే..
ఈ ఏడాది గిల్ 15 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 24.25 సగటు, 137.26 స్ట్రైక్ రేట్‌తో 291 పరుగులు చేశాడు. ఈ క్యాలెండర్ సంవత్సరంలో అతను ఇంకా టీ20 అర్ధ సెంచరీ సాధించలేదు.
Babar Azam : దటీజ్ బాబర్ ఆజామ్.. బిగ్‌బాష్ లీగ్ అరంగ్రేట మ్యాచ్‌లోనే..
ఇక సూర్యకుమార్ గణాంకాలు మరింత ఆందోళనకరంగా ఉన్నాయి. 18 ఇన్నింగ్స్‌లలో అతను 14.20 సగటు 125.29 స్ట్రైక్ రేట్‌తో 213 పరుగులు చేశాడు. యాదృచ్చికంగా.. సూర్యకుమార్, గిల్ ఇద్దరూ ఏడాది టీ20ల్లో చేసిన అత్యధిక స్కోరు 47 పరుగులు.
