Babar Azam : దటీజ్ బాబర్ ఆజామ్.. బిగ్‌బాష్ లీగ్ అరంగ్రేట మ్యాచ్‌లోనే..
బిగ్‌బాష్ లీగ్ అరంగ్రేట మ్యాచ్‌లో పాకిస్తాన్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజామ్ (Babar Azam) ఘోరంగా విఫలం అయ్యాడు.
Big shock to Babar Azam in BBL Debut
Babar Azam : బిగ్‌బాష్ లీగ్ 15వ సీజన్ ఆదివారం ప్రారంభమైంది. పెర్త్ వేదికగా జరిగిన ఆరంభ మ్యాచ్‌లో పెర్త్ స్కార్చర్స్, సిడ్నీ సిక్సర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ ద్వారానే పాకిస్తాన్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజామ్ (Babar Azam) బిగ్‌బాష్ లీగ్‌లో అరంగ్రేటం చేశాడు. అతడు అతడు సిడ్నీ సిక్సర్స్ కు ప్రాతినిథ్యం వహించాడు.
అయితే.. అతడు తన అరంగ్రేట మ్యాచ్‌లో ఘోరంగా విఫలం అయ్యాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన అతడు 5 బంతులు ఎదుర్కొని కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. బ్రోడీ కౌచ్ బౌలింగ్‌లో లారీ ఎవాన్స్ క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్‌కు చేరుకున్నాడు.
వర్షం కారణంగా మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్‌లో సిడ్నీ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 11 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. సిడ్నీ బ్యాటర్లలో జాక్ ఎడ్వర్డ్స్ (46 నాటౌట్; 21 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు), జోష్ ఫిలిప్ (28; 18 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) లు రాణించారు. బాబర్ ఆజామ్ (2), డేనియల్ హ్యూస్(0), హెన్రిక్స్ (9) లు ఘోరంగా విఫలం అయ్యారు. పెర్త్ బౌలర్లలో బ్రోడీ కౌచ్ రెండు వికెట్లు తీశాడు.
BABAR AZAM OUT FOR 2!#BBL15 pic.twitter.com/fqRiu8mewK
— KFC Big Bash League (@BBL) December 14, 2025
అనంతరం కూపర్ కానలీ (59; 31 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో చెలరేగడంతో పెర్త్ స్కార్చర్స్ 10.1 ఓవర్లలోనే 114 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. సిడ్నీ బౌలర్లలో బెన్ ద్వార్షుయిస్ రెండు వికెట్లు తీశాడు.
