Team India : దక్షిణాఫ్రికాపై మూడో టీ20 మ్యాచ్‌లో విజయం.. ఆస్ట్రేలియా చారిత్రాత్మక రికార్డును బ్రేక్ చేసిన భారత్..
సౌతాఫ్రికా పై విజయం సాధించి ఆస్ట్రేలియా చారిత్రక రికార్డును భారత్ (Team India) బద్దలు కొట్టింది.
IND vs SA 3rd T20 Team India break Australia historic record
Team India : ధర్మశాల వేదికగా ఆదివారం భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా పై విజయం సాధించి ఆస్ట్రేలియా చారిత్రక రికార్డును భారత్ బద్దలు కొట్టింది.
ఐడెన్ మార్‌క్రమ్ (61; 46 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 117 పరుగులు చేసింది. డోనోవన్ ఫెరీరా (20), అన్రిచ్ నార్ట్జే (12) లు మాత్రమే రెండు అంకెల స్కోరు సాధించారు.
రీజా హెండ్రిక్స్ (0), క్వింటన్ డికాక్ (1), డెవాల్డ్ బ్రెవిస్(2), ట్రిస్టన్ స్టబ్స్(9) లు ఘోరంగా విఫలం అయ్యారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె లు చెరో వికెట్ తీశారు.
ఆ తరువాత అభిషేక్ శర్మ (18 బంతుల్లో 35 పరుగులు), శుభ్‌మన్ గిల్ (28), తిలక్‌వర్మ (26 నాటౌట్) రాణించడంతో 118 పరుగుల లక్ష్యాన్ని భారత్ 15.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి అందుకుంది.
ఈ మ్యాచ్‌లో విజయంతో టీ20ల్లో దక్షిణాఫ్రికా జట్టు పై అత్యధిక విజయాలను సాదించిన జట్టుగా భారత్ రికార్డులకు ఎక్కింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాను అధిగమించింది. సౌతాఫ్రికా పై ఆసీస్ 19 టీ20 మ్యాచ్‌ల్లో గెలవగా.. తాజా మ్యాచ్‌తో భారత్ 20 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
టీ20 క్రికెట్‌లో దక్షిణాఫ్రికా పై అత్యధిక విజయాలు సాధించిన జట్లు ఇవే..
* భారత్ – 34 మ్యాచ్‌ల్లో 20 విజయాలు
* ఆస్ట్రేలియా – 28 మ్యాచ్‌ల్లో 19 విజయాలు
* వెస్టిండీస్ – 26 మ్యాచ్‌ల్లో 14 విజయాలు
* పాకిస్తాన్ – 27 మ్యాచ్‌ల్లో 14 విజయాలు
* ఇంగ్లాండ్ – 28 మ్యాచ్‌ల్లో 13 విజయాలు
