×
Ad

AUS-W vs IND-W : వ‌న్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన ఆసీస్‌.. మూడో వ‌న్డేలో భార‌త్ పై ఘ‌న విజ‌యం..

టీ20 సిరీస్‌లో ఎదురైన ప‌రాభ‌వానికి ఆస్ట్రేలియా మ‌హిళ‌ల జ‌ట్టు వ‌న్డే సిరీస్‌లో (AUS-W vs IND-W) భార‌త్ పై ఘ‌నంగా ప్ర‌తీకారం తీర్చుకుంది

AUS-W vs IND-W 3rd ODI Australia Women win by 185 runs

  • వ‌న్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన ఆసీస్‌
  • మూడో వ‌న్డేలో ఘ‌న విజ‌యం
  • టీ20 సిరీస్‌కు ఘ‌న ప్ర‌తీకారం

AUS-W vs IND-W : టీ20 సిరీస్‌లో ఎదురైన ప‌రాభ‌వానికి ఆస్ట్రేలియా మ‌హిళ‌ల జ‌ట్టు వ‌న్డే సిరీస్‌లో భార‌త్ పై ఘ‌నంగా ప్ర‌తీకారం తీర్చుకుంది. టీ20 సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయిన‌ ఆసీస్.. వ‌న్డే సిరీస్‌ను 3-0 క్లీన్ స్వీప్ చేసింది. హోబ‌ర్ట్ వేదిక‌గా జ‌రిగిన మూడో వ‌న్డే మ్యాచ్‌లో ఆసీస్ 185 ప‌రుగుల భారీ తేడాతో విజ‌యాన్ని సాధించింది.

410 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్ ఏ ద‌శ‌లోనూ ల‌క్ష్యం దిశ‌గా సాగ‌లేదు. ఓపెన‌ర్ స్మృతి మంధాన డ‌కౌట్ కాగా.. మ‌రో ఓపెన‌ర్ ప్ర‌తీకా రావ‌ల్ 27 ప‌రుగులు చేసింది. వ‌న్‌డౌన్ బ్యాట‌ర్ జెమీమా రోడ్రిగ్స్ (42; 29 బంతుల్లో 9 ఫోర్లు), స్నేహ్ రాణా (44; 74 బంతుల్లో 6 ఫోర్లు) కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ (25; 33 బంతుల్లో 2 ఫోర్లు) లు ప‌ర్వాలేద‌నిపించారు.

IND vs WI : భార‌త్ వ‌ర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్‌కు వ‌ర్షం ముప్పు ఉందా? టీమ్ఇండియాకు వ‌రుణుడు సాయం చేస్తాడా?

హ‌ర్లీన్ డియోల్ (14), రిచా ఘోష్ (18)ల‌తో పాటు మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో 45.1 ఓవ‌ర్ల‌లో భార‌త్ 224 ప‌రుగుల‌కే ఆలౌటైంది. ఆసీస్ బౌల‌ర్ల‌లో అలనా కింగ్ నాలుగు వికెట్లు తీసింది. జార్జియా వేర్‌హామ్ రెండు వికెట్లు సాధించింది. నికోలా కారీ, అన్నాబెల్ సదర్లాండ్, ఆష్లీ గార్డనర్ త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

IND vs WI : భార‌త్, వెస్టిండీస్ జ‌ట్ల మ‌ధ్య కీల‌క మ్యాచ్‌.. హెడ్‌-టు-హెడ్ రికార్డులు ఇవే.. ఎవ‌రిది పై చేయి అంటే?

అంత‌క ముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 409 ప‌రుగులు చేసింది. ఆసీస్ బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ అలిస్సా హీలీ (158; 98 బంతుల్లో 27 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) భారీ సెంచ‌రీ చేసింది. బెత్ మూనీ (106 నాటౌట్; 84 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌) లు శ‌త‌కాల‌తో చెల‌రేగారు. జార్జియా వాల్ (62; 52 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్ సెంచ‌రీ చేసింది. భార‌త బౌల‌ర్ల‌లో స్నేహ్ రాణా, శ్రీచ‌ర‌ణిలు చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. రేణుకా సింగ్ ఠాకూర్, కాష్వీ గౌతమ్, దీప్తి శర్మలు త‌లా ఓ వికెట్ తీశారు.