AUS-W vs IND-W test Australia Women opt to bowl
AUS-W vs IND-W : భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ పెర్త్‌లోని వాకా స్టేడియంలో ప్రారంభైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత మహిళల జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. నలుగురు ప్లేయర్లు ప్రతీకా రావల్, క్రాంతి గౌడ్, కాశ్వీ గౌతమ్, సయాలి సత్ఘారేలు ఈ మ్యాచ్ ద్వారా భారత్ తరుపున టెస్టుల్లో అరంగ్రేటం చేస్తున్నారు. కాగా.. ఆస్ట్రేలియా దిగ్గజ ప్లేయర్ అలిస్సా హీలీకి ఇదే చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావడం గమనార్హం.
🚨 Toss Update 🚨#TeamIndia have been put into bat first.
Updates ▶️ https://t.co/60dR7l123m#AUSvIND pic.twitter.com/FZfAxY3fVV
— BCCI Women (@BCCIWomen) March 6, 2026
‘మేము ముందుగా బౌలింగ్ చేస్తాం. సాధ్యమైనంత తక్కువ స్కోరుకు భారత్ ను పరిమితం చేస్తాం. ఈ మ్యాచ్ కోసం యువ పేసర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నా కెరీర్‌లో మరో నాలుగు రోజుల ఆట మిగిలి ఉంది. నా ఆఖరి మ్యాచ్‌ను భారత్‌తో ఆడడం చాలా బాగుంది. ఆఖరి సారి నా ప్రదర్శన చూసేందుకు నా స్నేహితులు, కుటుంబ సభ్యులు వచ్చారు. అందరికి ధన్యవాదాలు.’ అని ఆస్ట్రేలియా కెప్టెన్ అలిస్సా హీలీ అంది.
Jasprit Bumrah : జస్‌ప్రీత్ బుమ్రా.. 10 ఏళ్లలో 500 వికెట్లు.. నువ్వు మామూలోడివి కావు సామీ..
Debuts x 4️⃣! 🇮🇳
Congratulations to Pratika Rawal, Kashvee Gautam, Sayali Satghare, and Kranti Gaud on receiving their maiden Test caps 🧢
Updates ▶️ https://t.co/60dR7l123m#TeamIndia | #AUSvIND pic.twitter.com/7OvqNEzMWQ
— BCCI Women (@BCCIWomen) March 6, 2026
‘టాస్ గెలిచి ఉంటే మేము కూడా ముందుగా బౌలింగ్ చేసే వాళ్లం. ఫస్ట్ బ్యాటింగ్ లేదా సెకండ్ బ్యాటింగ్ ఏదైనా కానివ్వండి ఇక్కడి పరిస్థితులకు తగ్గట్లుగా రాణించాల్సిన అవసరం ఉంది. మాకు ఇదొ గొప్ప అవకాశం. మేము మా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాము. టీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్నప్పటికి కూడా వన్డే సిరీస్‌ను కోల్పోయాము. ఏదీఏమైనప్పటికి మా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తాము. నలుగురు ప్లేయర్లు అరంగ్రేటం చేస్తున్నారు. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నాము. ‘అని భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అంది.
Debuts x 4️⃣! 🇮🇳
Congratulations to Pratika Rawal, Kashvee Gautam, Sayali Satghare, and Kranti Gaud on receiving their maiden Test caps 🧢
Updates ▶️ https://t.co/60dR7l123m#TeamIndia | #AUSvIND pic.twitter.com/7OvqNEzMWQ
— BCCI Women (@BCCIWomen) March 6, 2026
ఆస్ట్రేలియా మహిళల తుది జట్టు..
ఫోబ్ లిచ్‌ఫీల్డ్, జార్జియా వోల్, ఎల్లీస్ పెర్రీ, అలిస్సా హీలీ (కెప్టెన్), అన్నాబెల్ సదర్లాండ్, బెత్ మూనీ (వికెట్ కీపర్), ఆష్లీ గార్డనర్, తహ్లియా మెక్‌గ్రాత్, అలానా కింగ్, లూసీ హామిల్టన్, డార్సీ బ్రౌన్
Here’s a look at #TeamIndia‘s Playing XI for the Test match 🙌
Pratika Rawal, Kashvee Gautam, Sayali Satghare, and Kranti Gaud are set for their Test debuts 👏
Updates ▶️ https://t.co/60dR7l0udO#AUSvIND pic.twitter.com/rg7gOrsHuo
— BCCI Women (@BCCIWomen) March 6, 2026
భారత మహిళల తుది జట్టు..
స్మృతి మంధాన , షఫాలీ వర్మ, ప్రతీకా రావల్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్ , రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ , కష్వీ గౌతమ్, స్నేహ రాణా, సయాలీ సత్ఘరే, క్రాంతి గౌడ్