ENG vs AUS 1st Ashes Test: ఇంగ్లాండ్ కొంపముంచిన ‘బజ్‌బాల్’.. ప్రతిష్టాత్మక యాషెస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా అద్భుత విజయం

ఐదో రోజు మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. నువ్వానేనా అన్నట్లు ఇరు జట్లు చివరి వరకు పోరాడాయి. చివరికి ఆసీస్ జట్టు విజేతగా నిలిచింది. ఇంగ్లాండ్ ‘బజ్‌‍‌బాల్’ క్రికెట్ వల్లే ఓడిందనే వాదన సర్వత్రా వినిపిస్తోంది.

ENG vs AUS 1st Ashes Test

ENG vs AUS 1st Ashes Test: ఐదు రోజుల పాటు సాగిన పోరులో ఉత్కంఠభరితమైన క్లైమాక్స్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ సారథ్యంలోని జట్టు ఇంగ్లాండ్‌ను ఓడించింది. ఫలితంగా ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరీస్‌లో 1-0తో ఆసీస్ జట్టు ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. చివరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన పోరులో విజయం చివరికి కంగారూలనే వరించింది. 281 పరుగుల లక్ష్య చేధనకు ఆసీస్ బ్యాటర్లు బరిలోకి దిగారు. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన ఓపెనర్ ఖవాజా రెండో ఇన్నింగ్స్ లోనూ (65 పరుగులు) రాణించాడు. మ్యాచ్ చేజారుతున్న దశలో కెప్టెన్ కమిన్స్ (44), నేథన్ లైయన్ (16) తో కలిసి ఆసీస్ జట్టును విజయతీరాలకు చేర్చారు. అయితే, ఇంగ్లాండ్ ‘బజ్‌‍‌బాల్’ క్రికెట్ వల్లే ఓడిందనే వాదన సర్వత్రా వినిపిస్తోంది.

Ashes 2023 : స్టీవ్ స్మిత్‌ను అవ‌మానించిన ఇంగ్లాండ్ అభిమానులు.. ‘నువ్వు ఏడుస్తుంటే మేము టీవీల్లో చూశాం’..

ఐదో రోజు మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. నువ్వానేనా అన్నట్లు ఇరు జట్లు చివరి వరకు పోరాడాయి. విజయానికి 281 పరుగుల లక్ష్యంతో నాలుగో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు.. నాలుగో రోజు ఆట పూర్తయ్యే సరికి మూడు వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. ఐదోరోజు 174 పరుగులు సాధిస్తే ఆస్ట్రేలియా విజయం సాధించొచ్చు. ఐదోరోజు వర్షం కారణంగా ఆట ఆలస్యంగా ప్రారంభమైంది. తొలి సెషన్ అంతా వర్షం కురవడంతో మ్యాచ్ డ్రాగా ముగుస్తుందని అందరూ భావించారు. ఆ తరువాత వర్షం తెరిపినివ్వడంతో.. రెండో సెషన్లో ఆసీస్ బ్యాటింగ్ ప్రారంభించింది. 67 ఓవర్లుకు 174 పరుగులు చేయాల్సి ఉంది.

ENG VS AUS Ashes : ఆస్ట్రేలియా విజ‌య ల‌క్ష్యం 281.. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 273 ఆలౌట్‌

టీ విరామం సమయానికి ఆసీస్ ఐదు వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. విజయానికి మరో 94 పరుగులు కావాలి. ఆ తరువాత కామెరాన్ గ్రీన్ (28), ఖవాజా (65), కేరీ (20) కొద్ది పరుగుల వ్యవధిలో ఔట్ కావటంతో మ్యాచ్ ఇంగ్లాండ్ వైపుకు వెళ్లిపోయింది. ఇంగ్లాండ్ విజయం దాదాపు ఖరారైంది. ఆసీస్ విజయం సాధించాలంటే మరో 54 పరుగులు చేయాల్సి ఉంది. కేవలం రెండు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ తరుణంలో ఆసీస్ కెప్టెన్ కమిన్స్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కమిన్స్, లైయన్ జోడీ వికెట్ కోల్పోకుండా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఫలితంగా యాషెస్ మొదటి టెస్టులో ఆస్ట్రేలియా జట్టు రెండు వికెట్ల తేడాతో మరో 27 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.

ట్రెండింగ్ వార్తలు