Nandni Sharma : చరిత్ర సృష్టించిన నందిని శర్మ.. డబ్ల్యూపీఎల్‌లో ఏకైక భారత ప్లేయర్.. బాల్ వేస్తే వికెట్ పడాల్సిందే..
ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ నందిని శర్మ (Nandni Sharma) అరుదైన ఘనత సాధించింది.
Nandni Sharma Creates History Becomes Highest Indian Wicket Taker in a WPL Season
Nandni Sharma : ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ నందిని శర్మ అరుదైన ఘనత సాధించింది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఓ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించింది. మంగళవారం గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీయడం ద్వారా ఈ ఘనత అందుకుంది. ఈ క్రమంలో సైకా ఇషాక్‌ను అధిగమించింది. సైకా ఇషాక్ డబ్ల్యూపీఎల్ 2023 సీజన్లో 15 వికెట్లు తీయగా.. నందిని ఈ సీజన్లోఇప్పటి వరకు 16 వికెట్లు సాధించింది.
24 ఏళ్ల ఈ రైట్ ఆర్మ్ పేసర్ ను డబ్ల్యూపీఎల్ 2026 వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ 20 లక్షలకు సొంతం చేసుకుంది. ఈ సీజన్లో లీగ్ దశలో గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నందిని హ్యాట్రిక్‌తో మెరిసింది. ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్ సహా 5 వికెట్లతో సత్తా చాటింది.
Gautam Gambhir : భారత మ్యాచ్‌ను బహిష్కరించనున్న పాక్ ? గంభీర్ సమాధానం ఇదే..
ఓ డబ్ల్యూపీఎల్ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన భారత ప్లేయర్లు వీరే..
* నందిని శర్మ – 16 వికెట్లు
* సైకా ఇషాక్ – 15 వికెట్లు
* శ్రీచరణి – 14 వికెట్లు
ఇక ఎలిమినేటర్ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో బెత్ మూనీ (62 నాటౌట్; 51 బంతుల్లో 6 ఫోర్లు), జార్జియా వేర్హామ్ (35; 25 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో షినెలి హెన్రీ మూడు వికెట్లు తీసింది. నందిని శర్మ రెండు వికెట్లు పడగొట్టింది. మిన్ను మణి ఓ వికెట్ సాధించింది.
T20 World Cup 2026 : దక్షిణాఫ్రికాతో భారత్ ఢీ.. ఎక్కడ చూడొచ్చొ తెలుసా?
𝐍𝐚𝐧𝐝𝐧𝐢 𝐒𝐡𝐚𝐫𝐦𝐚 𝐫𝐞𝐰𝐫𝐢𝐭𝐞𝐬 𝐭𝐡𝐞 𝐫𝐞𝐜𝐨𝐫𝐝 𝐛𝐨𝐨𝐤𝐬! 👏
She now has the most wickets by an Indian bowler in a single WPL season! 🔥#CricketTwitter pic.twitter.com/eaDwjGbC8w
— Female Cricket (@imfemalecricket) February 3, 2026
అనంతరం లిజెలి (43; 24 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్), జెమీమా రోడ్రిగ్స్ (41; 23 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) దంచికొట్టడంతో 15.4 ఓవర్లలో 169 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ ఛేదించింది. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా నాలుగో సీజన్లో ఫైనల్ కు చేరుకుంది. గత మూడు సందర్భాల్లో రన్నరప్‌గానే ఢిల్లీ నిలిచింది. ఈ సారైనా కప్పును ముద్డాడుతుందో లేదో వేచి చూడాల్సిందే.
