Babar Azam : కోహ్లీ, బట్లర్, వార్నర్ రికార్డులు బ్రేక్.. టీ20 క్రికెట్లో చరిత్ర సృష్టించిన బాబర్ ఆజామ్..
టీ20ల్లో పాకిస్థాన్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజామ్ (Babar Azam)అరుదైన ఘనత సాధించాడు
Babar Azam creates history becomes fastest to score 100 T20 fifties
- టీ20ల్లో 100 హాఫ్ సెంచరీలు చేసిన బాబర్ ఆజామ్
- అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న ఆటగాడిగా రికార్డు
Babar Azam : టీ20ల్లో పాకిస్థాన్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజామ్ అరుదైన ఘనత సాధించాడు. పొట్టి ఫార్మాట్లో అత్యంత వేగంగా 100 హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026లో భాగంగా క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బాబర్ ఆజామ్ హాఫ్ సెంచరీతో రాణించడంతో ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఈ క్రమంలో అతడు విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్, జోస్ బట్లర్ రికార్డులను అధిగమించాడు.
టీ20 క్రికెట్లో 100 హాఫ్ సెంచరీలు చేయడానికి కోహ్లీకి 401 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా.. బాబర్ కేవలం 341 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. డేవిడ్ వార్నర్ 435, జోస్ బట్లర్ 468 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించారు. బాబర్, కోహ్లీ, వార్నర్, బట్లర్లు మాత్రమే టీ20 క్రికెట్లో 100 హాఫ్ సెంచరీల మైలురాయిని తాకారు.
టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా 100 హాఫ్ సెంచరీలు సాధించిన ప్లేయర్లు..
* బాబర్ అజం – 341 ఇన్నింగ్స్‌లు
* విరాట్ కోహ్లీ – 401 ఇన్నింగ్స్‌లు
* డేవిడ్ వార్నర్ – 435 ఇన్నింగ్స్‌లు
* జోస్ బట్లర్ – 468 ఇన్నింగ్స్‌లు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన క్వెట్టా గ్లాడియేటర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌటంది. క్వెట్టా బ్యాటర్లలో హసన్ నవాజ్ (37) రాణించాడు. పెషావర్ జల్మీ బౌలర్లలో మహమ్మద్ బాసిత్, సుఫియాన్ ముకీమ్ లు చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ఇఫ్తికార్ అహ్మద్ ఓ వికెట్ పడగొట్టాడు.
also read : కోహ్లీ సంచలన వ్యాఖ్యలు.. 100 శాతం ఫిట్‌గా లేను.. అనారోగ్యంతో బాధపడుతున్నా..
అనంతరం బాబర్ ఆజామ్ (71 నాటౌట్; 51 బంతుల్లో 10 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించడంతో పెషావర్ జల్మీ జట్టు 18.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 155 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. క్వెట్టా బౌలర్లలో అల్జారి జోసెఫ్, సౌద్ షకీల్ లు చెరో వికెట్ పడగొట్టారు.
