Babar Azam : పీసీబీ కీలక నిర్ణయం.. పాక్ టెస్టు కెప్టెన్‌గా మళ్లీ బాబర్ ఆజామ్ నియామకం..
బాబర్ ఆజామ్ (Babar Azam) తిరిగి పాకిస్థాన్ టెస్టు కెప్టెన్‌గా నియమితులయ్యాడు.
- Thota Vamshi Kumar
- Updated on- July 5, 2026 / 03:02 PM IST
Babar Azam has returned as Pakistans Test captain
- పీసీబీ కీలక నిర్ణయం
- షాన్ మసూద్ పై వేటు
- పాకిస్థాన్ టెస్టు కెప్టెన్‌గా మళ్లీ బాబర్ ఆజామ్
Babar Azam : పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ ఆటగాడు బాబర్ ఆజామ్‌ను తిరిగి టెస్టు కెప్టెన్‌గా నియమించింది. ఇప్పటి వరకు టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన షాన్ మసూద్ ను ఆ బాధ్యతల నుంచి తప్పించింది. వెస్టిండీస్, ఇంగ్లాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌ల కోసం జట్లను ప్రకటిస్తూ ఈ నిర్ణయాన్ని వెల్లడించింది.
షాన్ మసూద్ నాయకత్వంలో పాక్ జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. అతడి కెప్టెన్సీలో 16 మ్యాచ్‌లు ఆడగా నాలుగు మ్యాచ్‌ల్లోనే పాక్ గెలుపొందింది. మిగిలిన 12 మ్యాచ్‌ల్లో ఓడిపోవడం గమనార్హం. ఈ క్రమంలోనే పీసీబీ మరోసారి బాబర్ ఆజామ్ సారథ్యం వైపే మొగ్గు చూపింది.
Vaibhav Sooryavanshi : అరంగ్రేటం చేస్తున్న విషయాన్ని ముందుగా వైభవ్ సూర్యవంశీ ఎవరికి చెప్పాడంటే?
వెస్టిండీస్‌తో పాక్ రెండు టెస్టులు ఆడనుంది. జూలై 25 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఆ తరువాత ఆగస్టు 19 నుంచి ఇంగ్లాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో పాక్ ఆడనుంది. ఈ రెండు సిరీస్‌లలో ఆడే జట్లను పీసీబీ ఎంపిక చేసింది. అనుభవజ్ఞులతో పాటు యువ ఆటగాళ్లకు చోటు ఇచ్చింది.
విండీస్‌తో సిరీస్‌కు ఎంపిక జట్టునే ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు ఎంపిక చేసింది. అదనంగా ఒక్క ప్లేయర్ సౌద్ షకీల్‌ను జట్టులోకి తీసుకుంది. అయితే.. అతడి ఎంపిక ఫిట్‌నెస్ పై ఆధారపడి ఉంటుందని సెలక్టర్లు తెలిపారు.
ఈ రెండు సిరీస్‌ల కోసం ప్రకటించిన జట్లలో నాలుగు కొత్త ముఖాలకు తొలిసారి టెస్ట్ జట్టులో చోటు దక్కింది. ఎడమచేతి స్పిన్నర్ అలీ ఉస్మాన్, బ్యాటర్ మహ్మద్ అవైస్ జఫర్, ఫాస్ట్ బౌలర్ ఉబైద్ షా, వికెట్‌కీపర్-బ్యాటర్ మహ్మద్ ఘాజీ ఘోరి తొలిసారి జాతీయ టెస్ట్ జట్టులో ఎంపికయ్యారు.
వెస్టిండీస్ సిరీస్‌కు పాక్ జట్టు ఇదే..
బాబర్ ఆజామ్(కెప్టెన్), అమీర్ జమాల్, అబ్దుల్లా ఫజల్, అలీ ఉస్మాన్, అజాన్ అవాయిస్, ఇమామ్ ఉల్ హక్, ఖుర్రం షాజాద్, మహ్మద్ అబ్బాస్, మహ్మద్ అలీ, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ అవైస్ జాఫర్, ముహమ్మద్ ఘాజీ ఘోరీ, సాజిద్ ఖాన్, సల్మాన్ అలీ అఘా, షాన్ మసూద్, ఉబైద్ షా.
Shreyas Iyer : ఓటమిపై స్పందించిన శ్రేయస్ అయ్యర్.. ఆ ఒక్క ఓవరే మా కొంపముంచింది
ఇంగ్లాండ్ సిరీస్‌కు పాక్ జట్టు ఇదే..
బాబర్ ఆజామ్(కెప్టెన్), అమీర్ జమాల్, అబ్దుల్లా ఫజల్, అలీ ఉస్మాన్, అజాన్ అవాయిస్, ఇమామ్ ఉల్ హక్, ఖుర్రం షాజాద్, మహ్మద్ అబ్బాస్, మహ్మద్ అలీ, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ అవైస్ జాఫర్, ముహమ్మద్ ఘాజీ ఘోరీ, సాజిద్ ఖాన్, సల్మాన్ అలీ అఘా, షాన్ మసూద్, ఉబైద్ షా, సౌద్ షకీల్.
