Babar Azam : సహనం కోల్పోయిన బాబర్ ఆజామ్.. ‘కోహ్లీ మ్యాచ్‌లను ముగిస్తాడు.. మరి నువ్వు..’ వీడియో వైరల్
మీడియా సమావేశంలో రిపోర్టర్ అడిగిన ప్రశ్న విని బాబర్ ఆజామ్ (Babar Azam) సహనం కోల్పోయాడు.
- Thota Vamshi Kumar
- Updated on- April 9, 2026 / 10:51 AM IST
Babar Azam lost his cool at a reporter when asked why he cant finish matches like Virat Kohli
- మీడియా సమావేశంలో రిపోర్టర్ ఊహించని ప్రశ్న
- సహనం కోల్పోయిన బాబర్ ఆజామ్
- అదంతా మీ అపోహే అంటూ మండిపాటు
Babar Azam : పాకిస్థాన్‌లోని స్టార్ క్రికెటర్లలో బాబర్ ఆజమ్ ఒకడు. అయితే.. కొందరు మాత్రం అతడిని టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీతో పోలుస్తూ ఉంటారు. ప్రస్తుతం బాబర్ పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో బిజీగా ఉన్నాడు. అతడు పెషావర్ జల్మీకి నాయకత్వం వహిస్తున్నాడు.
పీఎస్ఎల్ 2026లో భాగంగా బుధవారం కరాచీ వేదికగా పెషావర్ జల్మీ, హైదరాబాద్ కింగ్స్‌మెన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 18.2 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌటైంది. అనంతరం 146 పరుగుల లక్ష్యాన్ని పెషావర్ జల్మీ జట్టు సరిగ్గా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పెషావర్ బ్యాటర్లలో కెప్టెన్ బాబర్ ఆజామ్ (43; 37 బంతుల్లో 6 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
కాగా.. ఈ మ్యాచ్‌లో బాబర్ టాప్ స్కోరర్ గా నిలిచినప్పటికి కూడా చివరి వరకు క్రీజులో ఉండలేదు. దీనిపైనే మ్యాచ్ అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బాబర్ ఆజామ్‌కు ఓ ప్రశ్న ఎదురైంది. విరాట్ కోహ్లీలా మ్యాచ్‌లను ఎందుకు ముగించడం లేదని ఓ విలేకరి.. బాబార్ ఆజామ్‌ను ప్రశ్నించాడు. దీనిపై బాబర్ కాస్త అసహనాన్ని వ్యక్తం చేశాడు. పోలికలను ఆపేయాలని, తాను కూడా మ్యాచ్‌లను ముగిస్తున్నానని చెప్పుకొచ్చాడు.
రిపోర్టర్ : విరాట్ కోహ్లీ మీలాగే షాట్లు కొడతాడు. కానీ అతడు మ్యాచ్‌ను ముగిస్తాడు. అది మీలో లోపించింది. ప్రజలు అతన్ని మీతో పోలుస్తారు. ఈ పోలికపై మీ అభిప్రాయం ఏమిటి?
David Miller : డేవిడ్ మిల్లర్ ఎంత పని చేస్తివి.. కుల్దీప్ ఉన్నాడనే అలా చేశావా.. ఇప్పుడు చూడు..
బాబర్ ఆజామ్ : ఇక పైనా ఇలాంటివి ఆపేయండి. మీలోనే ఉంచుకోండి. పోలికలు వద్దు. ముందుకు సాగండి. నేను మ్యాచ్‌లను ముగించడం లేదన్నది మీ అపోహ మాత్రమే.
ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే.. పీఎస్ఎల్‌లో బాబర్ ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడాడు. 126.15 స్ట్రైక్‌రేటుతో 82 పరుగులు సాధించాడు.
