Axar Patel : కన్నీళ్లు పెట్టుకున్న డేవిడ్ మిల్లర్.. అక్షర్ పటేల్ చేసిన పనికి సర్వత్రా ప్రశంసలు.. నువ్వు నిజమైన కెప్టెన్ సామీ..
ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయిన తరువాత డేవిడ్ మిల్లర్‌తో అక్షర్ పటేల్ (Axar Patel) ప్రవర్తించిన తీరు ప్రస్తుతం వైరల్ అవుతోంది.
IPL 2026 DC vs GT Axar Patel Wins Hearts With This Gesture For David Miller (pic credit@ipl)
- ఒక్క పరుగు తేడాతో ఓడిపోయిన ఢిల్లీ
- తన వల్లే ఈ ఓటమి అంటూ కన్నీళ్లు పెట్టుకున్న డేవిడ్ మిల్లర్
- ఓదార్చిన అక్షర్ పటేల్
Axar Patel : ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో బుధవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఒక్క పరుగు తేడాతో ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఆటగాడు డేవిడ్ మిల్లర్ తన జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. గాయం కారణంగా రిటైర్‌హర్ట్‌గా వెనుదిరిగినప్పటికి.. జట్టు వికెట్లు కోల్పోవడంతో మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు. ఓ వైపు చేతి గాయం వేధిస్తున్నప్పటికి కూడా 20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 41 పరుగులతో అజేయంగా నిలిచాడు.
అయితే.. ఈ మ్యాచ్‌లో డేవిడ్ మిల్లర్ ఓ పెద్ద సాహసం చేశాడు. ఢిల్లీ విజయానికి రెండు బంతుల్లో రెండు పరుగులు అవసరం అయ్యాయి. స్ట్రైకింగ్‌లో డేవిడ్ మిల్లర్ ఉండగా ప్రసిద్ధ్ కృష్ణ ఐదో బంతిని వేశాడు. ఈ బంతికి మిల్లర్ షాట్ ఆడాడు. ఈజీగా సింగిల్ తీసే అవకాశం ఉన్నప్పటికి కూడా మిల్లర్ పరుగు తీసేందుకు నిరాకరించాడు.
అయితే.. ఆఖరి బంతిని ప్రసిద్ద్ కృష్ణ స్లో బౌన్సర్ వేయగా.. మిల్లర్ బాల్‌ను కొట్టలేకపోయాడు. బై రూపంలో పరుగు తీసి మ్యాచ్‌ను సూపర్ ఓవర్‌కు తీసుకువెళ్లాలని ప్రయత్నించగా.. కుల్దీప్ యాదవ్ రనౌట్ అయ్యాడు. దీంతో ఢిల్లీ పరుగు తేడాతో ఓడిపోయింది.
Watch it yourself to believe it 🤯
A nerve-wrecking finish to a #TATAIPL classic 🥶 @gujarat_titans fans, you can breathe now 😅
Updates ▶️ https://t.co/oOdPR1oSeP#TATAIPL | #KhelBindaas | #DCvGT pic.twitter.com/Wh5EQvshqd
— IndianPremierLeague (@IPL) April 8, 2026
ఒకవేళ మిల్లర్ ఐదో బంతికి సింగిల్ తీసి ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేదని విశ్లేషకులు చెబుతున్నారు. మిల్లర్ సింగిల్ తీసి ఉంటే మ్యాచ్ టై అయ్యేదని, ఆఖరి బంతికి కుల్దీప్ యాదవ్ షాట్ ఆడినా, బై రూపంలో సింగిల్ తీసినా ఢిల్లీ గెలిచేదని అంటున్నారు.
David Miller : డేవిడ్ మిల్లర్ ఎంత పని చేస్తివి.. కుల్దీప్ ఉన్నాడనే అలా చేశావా.. ఇప్పుడు చూడు..
ఇక తన జట్టు పరుగు తేడాతో ఓడిపోవడంతో మిల్లర్ ఎమోషనల్ అయ్యాడు. తాను చేసిన పొరపాటు కారణంగానే ఓడిపోయిందని కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీన్ని గమనించిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్.. డేవిడ్ మిల్లర్ ను ఓదార్చాడు. ఏ కాలేదు అన్నట్లుగా అతడితో మాట్లాడాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా అక్షర్ పటేల్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. కెప్టెన్ అంటే నీలా ఉండాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
