Babar Reaction Goes Viral After Test Replacement Kamran Ghulam Slams Debut Ton
PAK vs ENG : గత కొన్నాళ్లుగా పేలవ ఫామ్‌లో సతమతం అవుతున్నాడు స్టార్ ఆటగాడు బాబర్ ఆజాం. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌తో రెండో టెస్టుకు జట్టు నుంచి అతడిని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తప్పించింది. అతడి స్థానంలో కమ్రాన్ గులామ్ ను ఎంపిక చేసింది. తన ఎంపిక సరైందే అని నిరూపిస్తూ రెండో టెస్టు మ్యాచులో తొలి రోజే కమ్రాన్ సెంచరీతో చెలరేగాడు. ఈ క్రమంలో అరంగ్రేట టెస్టు మ్యాచులోనే సెంచరీ చేసిన 13వ పాకిస్థాన్ బ్యాటర్‌గా రికార్డులకు ఎక్కాడు.
మొత్తంగా 224 బంతులు ఎదుర్కొన్న కమ్రాన్ 11 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 118 పరుగులు సాధించాడు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న కమ్రాన్ పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో బాబర్ ఆజాం సైతం కమ్రాన్ ను అభినందించాడు.
SL vs WI : 5, 7, 4, 0, 14, 4, 20, 1, 7, 16, 5.. వెస్టిండీస్ ఫోన్ నంబర్ ఇదా!
సెంచరీ అనంతరం కమ్రాన్ సెలబ్రేషన్స్ ఫోటోలను పోస్ట్ చేస్తూ.. చాలా బాగా ఆడావు కమ్రాన్ అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.
మంగళవారం ముల్తాన్ వేదికగా ఇంగ్లాండ్‌తో ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్‌లో పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. కమ్రాన్ (118) శతకంతో చెలరేగగా, సయిమ్ అయుబ్ (77) హాఫ్ సెంచరీతో రాణించాడు. మహ్మద్ రిజ్వాన్ (37), అగా సల్మాన్ (5) లు క్రీజులో ఉన్నారు.