French Open Final : ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా బార్బొరా క్రెజికోవా
ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి బార్బొరా క్రెజికోవా(25) విజేతగా అవతరించింది. టోర్నీ ఫైనల్లో రష్యా స్టార్ పల్లిచెంకోవాపై 6-1, 2-6, 6-4 తేడాతో క్రెజికోవా గెలిచింది.
- Sreehari A
- Updated on- June 12, 2021 / 10:56 PM IST
French Open Final
Barbora Krejcikova Grand Slam title at French Open : ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి బార్బొరా క్రెజికోవా(25) విజేతగా అవతరించింది. టోర్నీ ఫైనల్లో రష్యా స్టార్ పల్లిచెంకోవాపై 6-1, 2-6, 6-4 తేడాతో క్రెజికోవా గెలిచింది. తన కెరీర్లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను క్రెజికోవా గెల్చుకుంది.
ఎలాంటి భారీ అంచనాలు లేకుండా టోర్నీలోకి అడుగుపెట్టిన 33వ ర్యాంకర్ క్రెజికోవా.. టైటిల్‌ను సునాయసంగా సొంతం చేసుకుంది. ఈ టోర్నీకి ముందు ఏ గ్రాండ్‌స్లామ్‌లోనూ క్రెజికోవా కనీసం 4వ రౌండ్ కూడా దాటలేదు.
52వ గ్రాండ్‌స్లామ్‌లో ఆడిన పావ్లిచెంకోవా ఫైనల్ బెర్త్ దక్కించుకోవడం ఇదే తొలిసారి. అంతకుముందు ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైనల్లో 17వ సీడ్ మరియా సక్కారి (గ్రీస్) పై బార్బోరా క్రెజికోవా (చెక్ రిపబ్లిక్) 7-5, 4-6, 9-7తో విజయం సాధించింది.
