IND vs ENG : ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ఇదే.. కోహ్లీ విషయంలో కీలక కండిషన్
భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు సంబంధించిన వన్డే జట్టును (IND vs ENG ) తాజాగా బీసీసీఐ ప్రకటించింది.
- Thota Vamshi Kumar
- Updated on- June 21, 2026 / 02:31 PM IST
BCCI Announced Team India ODI squad for the England tour
- ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ఎంపిక
- గాయంతో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దూరం
- సీనియర్లు రోహిత్, కోహ్లీకి చోటు
IND vs ENG : భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు సంబంధించిన వన్డే జట్టును తాజాగా బీసీసీఐ ప్రకటించింది. అందరు అనుకున్నట్లుగా టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ సిరీస్‌కు కూడా దూరంగా ఉన్నాడు. ఇక సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక చేశారు. అయితే.. గాయంతో అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న కోహ్లీ తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంది. అతడు ఫిట్‌నెస్ పరీక్ష పాసైతేనే ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో ఆడతాడని, లేదంటే ఆడడని సెలక్టర్లు తెలిపారు.
ఇక ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైన వరుణ్ చక్రవర్తి గాయపడ్డాడు. దీంతో అతడు ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సీఓఈలో కోలుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో అతడు ఐర్లాండ్ పర్యటన నుంచి తప్పుకున్నాడు.
ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ఇదే..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ*, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీశ్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్.
భారత్. ఇంగ్లాండ్ వన్డే సిరీస్ షెడ్యూల్ ఇదే..
* తొలి వన్డే – జూలై 14న (ఎడ్జ్‌బాస్టన్)
* రెండో వన్డే – జూలై 26న (సోఫియా గార్డెన్స్)
* మూడో వన్డే – జూలై 19న (లార్డ్స్)
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు అప్‌డేట్ చేసిన భారత జట్టు ఇదే..
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబె, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, ప్రసిద్ధ్ కృష్ణ.
🚨 News 🚨
India’s ODI squad for the England tour announced.
𝗡𝗢𝗧𝗘: Varun Chakaravarthy has been ruled out of the Ireland T20I Series as he continues his rehab at the BCCI COE.
More Details ▶️ https://t.co/wOdXTQqJto #TeamIndia | #ENGvIND pic.twitter.com/t0GypgM4kp
— BCCI (@BCCI) June 21, 2026
