BCCI New Rules IPL: మ‌రో రెండు మ్యాచ్‌ల్లో ముగియ‌నున్న సీజ‌న్‌.. కొత్త రూల్స్ తీసుకువ‌చ్చిన బీసీసీఐ

BCCI New Rules: ఐపీఎల్ 2026లో ఆట‌గాళ్లు, స‌హాయక సిబ్బందికి బీసీసీఐ (BCCI ) కీల‌క ఆదేశాలు జారీ చేసింది.

BCCI New Rules For Players And Officials before 2 Matches Remain In IPL 2026

  • మ‌రో రెండు మ్యాచ్‌లు పూర్తి అయితే ముగియ‌నున్న ఐపీఎల్ 2026 సీజ‌న్‌
  • ఈ స‌మ‌యంలో కొత్త రూల్స్ తీసుకువ‌చ్చిన బీసీసీఐ

BCCI New Rules : ఐపీఎల్ 2026 సీజ‌న్ ఆఖ‌రి అంకానికి చేరుకుంది. మ‌రో రెండు మ్యాచ్‌లు మాత్ర‌మే మిగిలి ఉన్నాయి. నేడు (శుక్ర‌వారం మే29) క్వాలిఫ‌య‌ర్-2 మ్యాచ్ జ‌ర‌గ‌నుండ‌గా మే 31న ఆదివారం ఫైన‌ల్ మ్యాచ్‌తో ఐపీఎల్ 2026 సీజ‌న్ పూర్తి కానుంది. ఈ క్ర‌మంలో బీసీసీఐ కీల‌క ఆదేశాలు జారీ చేసింది.

అత్యాధునిక క‌మ్యూనికేష‌న్ డివైజ్‌ల వినియోగం పెరుగుతుండ‌డంతో ఆట‌గాళ్లు, స‌హాయక సిబ్బంది మైదానంలో స్మార్ట్ గ్లాసెస్‌, స‌న్‌గ్లాసెస్ త‌ర‌హా గ్యాడ్జెట్‌ల‌ను వాడొద్ద‌ని ఆదేశించింది. బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం సూచ‌న‌ల మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకుంది. వీటి వ‌ల్ల లైవ్ స్ట్రీమింగ్‌తో పాటు మెసేజ్‌లు చేసుకునే వెలుసుబాటు ఉండ‌ట‌మే కార‌ణం అని చెప్పింది.

*Hardik Pandya : హార్దిక్ పాండ్యా మెడ‌పై వేలాడుతున్న క‌త్తి! కెప్టెన్సీ పోవ‌డం ఖాయ‌మే! ఆట‌గాడిగా కూడా చోటులేదా?

ఇక మైదానంలోకి వెళ్లేముందు ఆట‌గాళ్లు, స‌హాయ‌క సిబ్బంది త‌మ స్మార్ట్ స‌న్‌గ్లాసెస్ కూడా డిపాజిట్ చేయాల‌ని బోర్డు కోరింది. ఇలా చేయ‌ని ప‌క్షంలో చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించింది.

‘మ్యాచ్ రోజులలో మైదానంలోకి ప్రవేశించేటప్పుడు, ఆటగాళ్లు, సహాయక సిబ్బంది అందరూ తమ మొబైల్ ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లతో పాటు అటువంటి పరికరాలను సెక్యూరిటీ లైజన్ ఆఫీసర్ వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశిస్తున్నాం.’ అని బోర్డు తెలిపింది.