BCCI New Rule : IPL లో సంచలనం.. హనీట్రాప్ కలకలం.. BCCI కొత్త రూల్స్.. ఇకపై అవన్నీ బంద్.. ఉల్లంఘిస్తే సస్పెన్షన్

BCCI New Rule : ఐపీఎల్ లో గత కొద్ది రోజులుగా వెలుగు చూస్తోన్న ఉల్లంఘనలను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.

BCCI strict new rule for IPL teams No visitors in hotel rooms no interaction with owners

BCCI New Rule : ప్రస్తుత ఐపీఎల్ 2026 సీజన్‌లో తరచుగా వెలుగుచూస్తున్న ప్రోటోకాల్ ఉల్లంఘనలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆటగాళ్లు, జట్టు సిబ్బంది వివాదాల్లో చిక్కుకోకుండా ఉండేందుకు గాను కఠిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ముఖ్యంగా హనీ ట్రాప్ ఘటనలు, లైంగిక ఆరోపణలు వంటి సమస్యలు తలెత్తకుండా చూసేందుకు గాను బీసీసీఐ ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా 10 ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ప్రత్యేక మార్గదర్శకాలను పంపారు. ఆటగాళ్ల భద్రత, టోర్నీ సమగ్రత దృష్ట్యా ఈ నూతన మార్గదర్శకాలను విడుదల చేసినట్లు తెలిపారు.

ఈ నిబంధనల ప్రకారం, అనధికార సందర్శకులను తమ గదుల్లోకి అనుమతించవద్దని, తమ జట్ల యజమానులను కలవవద్దని బీసీసీఐ జట్టు సభ్యులను కోరింది మరియు వేప్‌లను (vapes) నిషేధించింది. ఇందుకు ప్రధాన కారణం ఐపీఎల్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా హనీట్రాప్ వంటి ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉన్నందున ప్రతి ఫ్రాంచైజీ అప్రమత్తంగా ఉండాలని యాజమాన్యాలకు సూచించారు.

*సూర్య కుమార్ యాదవ్‌కు బిగ్ షాక్..! రంగంలోకి శ్రేయస్ అయ్యర్..

బీసీసీఐ తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. ప్లేయర్స్ బస చేసే హోటల్ గదుల్లో ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీలు నిర్వహించవచ్చు. దీనికోసం బీసీసీఐ, ఐపీఎల్ ఆపరేషన్స్ టీమ్ సభ్యులతో కూడిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. అలాగే జట్టు సభ్యులు బస చేసే హోటళ్లలో ఎవరికైనా అనధికారికంగా ప్రవేశం కల్పిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని బీసీసీఐ బోర్డు స్పష్టం చేసింది.

జట్టు ప్లేయర్స్ లేదా సిబ్బంది గదుల్లోకి ఎవరైనా రావాలంటే.. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులైనా సరే.. ముందుగా టీమ్ మేనేజర్ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని నూతన మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. అలాగే క్రీడాకారులు, వారి సిబ్బంది హోటల్ నుంచి బయటకు వెళ్లాలంటే.. కచ్చితంగా సెక్యూరిటీ లైజన్ ఆఫీసర్ లేదా టీమ్ ఇంటిగ్రిటీ ఆఫీసర్‌కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అలాగే టోర్నీ సమయంలో క్రీడాకారులు వ్యక్తిగత ప్రయాణాలు చేయాలనుకుంటే.. వాటి గురించి కూడా టీమ్ మేనేజర్‌కు తెలియజేయాల్సి ఉంటుంది.

*దెబ్బకొట్టిన లక్నో..! ఆర్సీబీ కూడా ఆస్సామేనా?.. ప్లే ఆఫ్స్ చేరాలంటే.. అబ్బో ఈక్వేషన్ ఇదే..

ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘించినట్లయితే.. బీసీసీఐ వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి షోకాజ్ నోటీసులు, పెద్ద మొత్తంలో జరిమానాలు, సస్పెన్షన్ లేదా టోర్నీ నుంచి డిస్‌క్వాలిఫై చేయడం వంటి చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఫ్రాంచైజీలు ఈ మార్గదర్శకాలను పూర్తిగా అమలు చేయాలని బీసీసీఐ లేఖలో సూచించింది. ఇక మ్యాచ్‌ల సమయంలో ఫ్రాంచైజీ యజమానులు డగౌట్‌లో ఆటగాళ్లు లేదా మేనేజర్లతో నేరుగా మాట్లాడకూడదని కూడా బీసీసీఐ స్పష్టం చేసింది. ఐపీఎల్ ప్రతిష్టను కాపాడేందుకే ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు బీసీసీఐ చెప్పుకొచ్చింద