IPL 2026 : దెబ్బకొట్టిన లక్నో..! ఆర్సీబీ కూడా ఆస్సామేనా?.. ప్లే ఆఫ్స్ చేరాలంటే.. అబ్బో ఈక్వేషన్ ఇదే..
IPL 2026 : ఆర్సీబీ ఇప్పటి వరకు మొత్తం పది మ్యాచ్‌లు ఆడింది. 12 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఇంకా మరో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఉన్న పంజాబ్ కిగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఉన్నాయి.
Virat Kohli
- లక్నోపై ఓడిన ఆర్సీబీ
- పాయింట్ల పట్టికలో మూడో స్థానంకు
- ఆగ్రస్థానంలో నిలవాలంటే ఆ రెండు జట్లపై గెలవాల్సిందే
IPL 2026 : ఐపీఎల్ 2026 టోర్నీ రసవత్తరంగా సాగుతోంది. ప్లేఆఫ్స్‌కు చేరుకునేందుకు జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అయితే, డిపెండింట్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మరోసారి విజేతగా నిలిచేందుకు పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో నిన్నమొన్నటి వరకు ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ఆర్సీబీ జట్టు వరుస ఓటములతో క్రమంగా కిందికి దిగొస్తోంది. గురువారం లక్నోతో జరిగిన మ్యాచ్‌లోనూ ఆ జట్టు ఓడిపోవటంతో ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరుతుందా అనే సందేహాలు ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయితే, ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరడంతోపాటు మొదటి రెండు స్థానాల్లో ఉండాలంటే.. కచ్చితంగా ఈ రెండు జట్లపై విజయం సాధించాల్సి ఉంటుంది.
ఆర్సీబీ ఇప్పటి వరకు మొత్తం పది మ్యాచ్‌లు ఆడింది. 12 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఇంకా మరో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఉన్న పంజాబ్ కిగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఉన్నాయి. పాయింట్ల పట్టికలో ఆర్సీబీ అగ్రస్థానంలో నిలవాలంటే ఈ రెండు జట్లపై జరిగే మ్యాచ్‌లో కచ్చితంగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ రెండు జట్లపై ఓడిపోతే.. టాప్ -3, 4 ప్లేస్‌లు కూడా గల్లంతయ్యే ప్రమాదం పొంచిఉంది.
ఆర్సీబీ మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో ముంబై, కేకేఆర్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లతో ఆడాల్సి ఉంటుంది. ఈ నాలుగు మ్యాచ్‌లలో గెలిస్తే 20 పాయిట్లతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలుస్తుంది. ఒకవేళ.. ఆర్సీబీ మూడు మ్యాచ్‌లలో విజయం సాధిస్తే 18 పాయింట్లు సాధిస్తుంది.. ఒకవేళ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ లేదంటే ఇతర జట్లు 18 పాయింట్లకు చేరితే రన్‌రేట్ మెరుగ్గా ఉన్న కారణంగా ఆర్సీబీ టాప్ప్లేస్ కాపాడుకునే అవకాశం ఉంటుంది.
ఒకవేళ ఆర్సీబీ కేవలం రెండు మ్యాచ్‌లలోనే విజయం సాధిస్తే.. ఆర్సీబీ రెండవ స్థానంలో లేదా అంతకంటే మెరుగైన స్థానంలో నిలవాలంటే, ఎస్ఆర్హెచ్ తమ మిగిలిన మూడు మ్యాచ్‌లలో కనీసం రెండింటిలో ఓడిపోవాలి. లేదంటే పంజాబ్ కింగ్స్ జట్టు తమ మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో కనీసం మూడింటిలో ఓడిపోవాలి. అదనంగా, ఆర్ఆర్, జిటి (ప్రస్తుతం 12 పాయింట్లతో ఉన్నాయి) తమ మిగిలిన మ్యాచ్‌లలో రెండింటి కంటే ఎక్కువ గెలవకూడదు.
పాయింట్ల పట్టికలో ఈ గందరగోళానికి స్వస్తి చెప్పాలంటే ఆర్సీబీ తన తరువాతి రెండు మ్యాచ్‌లను తప్పక గెలవాల్సి ఉంటుంది. ఆర్సీబీ భారీ రన్ రేట్ కారణంగా.. ఆ జట్టు మరో మూడు మ్యాచ్‌లు గెలిస్తే 18 పాయింట్లతో ముగించే ఏ ఇతర జట్టునైనా అధిగమించడం దాదాపు ఖాయం. కానీ, నాలుగింటిలో.. రెండు లేదంటే మూడు మ్యాచ్‌లలో ఆర్సీబీ ఓడిపోతే ఎలిమినేటర్ స్థానంతో (3వ లేదా 4వ స్థానం) సరిపెట్టుకునే పరిస్థితి నెలకొంటుంది.
