suryakumar yadav : సూర్య కుమార్ యాదవ్‌కు బిగ్ షాక్..! రంగంలోకి శ్రేయస్ అయ్యర్..
suryakumar yadav : సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ కు టీ20 ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని బీసీసీఐ నిర్ణయాని వచ్చినట్లు క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Suryakumar Yadav Shreyas Iyer
suryakumar yadav : బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. టీమిండియా టీ20 కెప్టెన్ గా కొత్తవారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం టీ20 క్రికెట్ ఫార్మాట్‌కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అయితే, కొంతకాలంగా ఆశించిన స్థాయిలో సూర్య పరుగులు రాబట్టలేక పోతున్నాడు. సూర్య ఫామ్ అందుకుంటాడని వేచిచూసినప్పటికీ అతని ఆటతీరులో పెద్దగా మార్పురాకపోవడంపై బీసీసీఐ పెద్దలు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. దీంతో అతన్ని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించేందుకు సిద్ధమైందన్న ప్రచారం జరుగుతోంది.
సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్‌కు టీ20 ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని బీసీసీఐ నిర్ణయానికి వచ్చినట్లు క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జూన్ నెలాఖరులో రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత జట్టు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. జులై 1 నుంచి ఇంగ్లాండ్, భారత్ మధ్య ఐదు టీ20 సిరీస్‌లు జరగనున్నాయి.
ఐపీఎల్ ముగిసిన తరువాత సెలక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఆ సమావేశంలో శ్రేయస్స్ అయ్యర్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తూ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం టీ20 కెప్టెన్సీ బాధ్యతలే కాకుండా.. వన్డే కెప్టెన్సీ బాధ్యతలనుకూడా శ్రేయస్‌కు అప్పగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం టీమిండియాకు వన్డే, టీ20 ఫార్మాట్లకు వేరువేరు కెప్టెన్లు కొనసాగుతున్నాయి. అయితే, వన్డే, టీ20 ఫార్మాట్లకు రెండింటికి ఒకే ప్లేయర్ కు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వాలని బీసీసీఐ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఐపీఎల్ 2026 పూర్తయిన తరువాత టీ20, వన్డే ఫార్మాట్లకు కెప్టెన్సీ బాధ్యతలను శ్రేయస్ అయ్యర్‌కు అప్పగిస్తారని క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
