IND vs SL : ఆ ఒక్క‌డి కోసం శ్రీలంక టెస్టు సిరీస్ జ‌ట్టు ప్ర‌క‌ట‌న వాయిదా..! తోపు ప్లేయ‌ర్ కానే కాదు.. అయినా గానీ బీసీసీఐ ఎందుకిలా చేస్తోంది?

ఆగ‌స్టు 15 నుంచి భార‌త్, శ్రీలంక జ‌ట్ల మ‌ధ్య (IND vs SL) రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.

BCCI Worried Over Washington Sundar Fitness Ahead Of ind vs sl Test Series

IND vs SL : ఆగ‌స్టు 15 నుంచి భార‌త్, శ్రీలంక జ‌ట్ల మ‌ధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో పాల్గొనే భార‌త జ‌ట్టును ఇప్ప‌టి వ‌ర‌కు బీసీసీఐ ఎంపిక చేయ‌లేదు. ఓ ఆట‌గాడి విష‌యం తేలే వ‌ర‌కు జ‌ట్టు ఎంపిక ప్ర‌క్రియ‌ను తాత్కాలికంగా వాయిదా వేసిన‌ట్లు ఆంగ్ల మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాడు. అత‌డు మ‌రెవ‌రో కాదు ఆల్‌రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్‌.

ఇంగ్లాండ్‌తో జ‌రిగిన రెండో వ‌న్డేలో వాషింగ్ట‌న్ సుంద‌ర్ గాయ‌ప‌డ్డాడు. కండ‌రాల గాయంతో బాధ‌ప‌డుతున్న అత‌డు ప్ర‌స్తుతం బెంగ‌ళూరులోని బీసీసీఐ సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్‌లో ఉన్నాడు. అక్క‌డ అత‌డి గాయానికి స్కానింగ్ నిర్వ‌హించ‌నున్నారు. అత‌డి గాయంపై పూర్తి నివేదిక వ‌చ్చాకే లంక‌తో టెస్టు సిరీస్‌కు (IND vs SL) జ‌ట్టును ప్ర‌క‌టించాల‌ని బీసీసీఐ ఆలోచిస్తున్న‌ట్లు ఓ అధికారి వెల్ల‌డించారు.

IND vs ZIM : భార‌త్ ఇజ్జ‌త్ తీసిన జింబాబ్వే కెప్టెన్.. సిరీస్‌లో టీమ్ఇండియా ఫేవ‌రేట్ కాదు.. సికింద‌ర్ రజా కీల‌క వ్యాఖ్య‌లు..

గిల్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు ఆగ‌స్టు 4న శ్రీలంక వెళ్లనుంది. అక్క‌డి స్థానిక ప‌రిస్థితుల‌కు, టెస్టు ఫార్మాట్‌కు అల‌వాటు ప‌డేందుకు వీలుగా ఆగ‌స్టు 7 నుంచి 10 వ‌ర‌కు కొలంబోలో నాలుగు రోజుల వార్మ‌ప్ మ్యాచ్ ఆడ‌నుంది. తొలి టెస్టు మ్యాచ్ ఆగ‌స్టు 15 నుంచి 19 వ‌ర‌కు గాలే వేదిక‌గా జ‌ర‌గ‌నుంది. రెండో టెస్టు మ్యాచ్ ఆగ‌స్టు 23 నుంచి 27 వర‌కు జ‌ర‌గ‌నుంది.

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) దృష్ట్యా ఈ సిరీస్ ఇరు జట్లకూ ఎంతో కీల‌కం. డ‌బ్ల్యూటీసీ పాయింట్ల ప‌ట్టిక‌లో భారత్ ప్ర‌స్తుతం 48.15 పాయింట్ల శాతంతో ఐదో స్థానంలో ఉండగా, శ్రీలంక 44.44 పాయింట్ల శాతంతో ఆరో స్థానంలో ఉంది. ఈ సిరీస్‌లో విజయం సాధించి డబ్ల్యూటీసీలో త‌మ స్థానం మెరుగుప‌ర‌చుకోవాల‌ని ఇరు జ‌ట్లు భావిస్తున్నాయి.